పుట్టినరోజున మానవత్వం చాటుకున్న బిఆర్ఎస్ యువ నాయకులు నారం రాజశేఖర్

​వృద్ధాశ్రమంలో ఘనంగా వేడుకలు

పుట్టినరోజున మానవత్వం చాటుకున్న బిఆర్ఎస్ యువ నాయకులు నారం రాజశేఖర్

అన్నదానంతో ఆదర్శంగా నిలిచిన మాజీ సర్పంచ్

IMG-20260320-WA0081​అశ్వారావుపేట, లోకల్ గైడ్ :
ఆడంబరాలకు స్వస్తి చెప్పి, సేవా దృక్పథంతో తన పుట్టినరోజును జరుపుకొని అశ్వారావుపేట నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ యువజన నాయకులు, మాజీ సర్పంచ్ నారం రాజశేఖర్ అందరికీ ఆదర్శంగా నిలిచారు. తన జన్మదినాన్ని పురస్కరించుకుని స్థానిక అమ్మ సేవా సదనం వృద్ధాశ్రమంలో ఆయన ఘనంగా సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ వేడుకల్లో నియోజకవర్గ సీనియర్ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మాజీ ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామ్ మూర్తి, కాసాని చంద్రం, కాసాని పద్మ, మందపాటి మోహన్ రెడ్డి, నియోజకవర్గ నాయకురాలు వగ్గెల పూజ, టౌన్ అధ్యక్షులు సత్యవరపు సంపూర్ణ వంటి ప్రముఖుల సమక్షంలో రాజశేఖర్ కేక్ కట్ చేశారు. అనంతరం వృద్ధాశ్రమంలోని వృద్ధులకు ఆయన స్వయంగా అన్నదానం చేసి వారి ఆకలి తీర్చారు. ​ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ సమాజంలో నిస్సహాయ స్థితిలో ఉన్న వృద్ధులకు సేవ చేయడం వల్ల కలిగే తృప్తి మరెక్కడా దొరకదు. కన్నవారిని గౌరవించి వారి ఆశీస్సులు పొందడమే నిజమైన వేడుక. ఆడంబరాల కోసం వృధా ఖర్చు చేయకుండా, ఇలాంటి సేవా కార్యక్రమాలతో జన్మదినాన్ని జరుపుకోవడం నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తోందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ సేవా దృక్పథాన్ని అలవర్చుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ​ఈ కార్యక్రమంలో టిన్యూస్ రిపోర్టర్ మణికంఠ, నాయకులు జీవన్ రావు, అఖిల్, శ్రీను, దుర్గా రావు, సుధాకర్, అజయ్, కృష్ణ పాల్గొన్నారు. అలాగే దమ్మపేట మండలం బిఆర్ఎస్ పార్టీ యూత్ నాయకులు నరసింహ, వీరాస్వామి, నాగేంద్ర బాబు, బాలకృష్ణ తదితరులు పాల్గొని రాజశేఖర్ చేసిన ఈ గొప్ప పనిని ప్రత్యేకంగా అభినందించారు.​రాజశేఖర్ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షిస్తూ పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఆయనకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేశారు.

Tags:

About The Author

Latest News