వృద్ధాశ్రమంలో జన్మదిన వేడుకలు
కేశంపేట్ మాజీ జెడ్పిటిసి తాండ్ర విశాల శ్రవణ్ రెడ్డి సేవా కార్యక్రమం
By Ram Reddy
On
లోకల్ గైడ్ కేశంపేట్:
ఈ సందర్భంగా వృద్ధులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసి, వారికి ఆత్మీయంగా భోజనం వడ్డించారు. వృద్ధుల ఆశీర్వాదాలు తీసుకుంటూ “సమాజానికి సేవ చేయడం జీవితంలో గొప్ప ఆనందం” అని ఆమె పేర్కొన్నారు. వేడుకల్లో స్థానిక నాయకులు, అభిమానులు పాల్గొన్నారు.
“విశాల” హృదయం – నాయకత్వంలో నవ్యపథం
తెలంగాణ ఉద్యమకారుడు తాండ్ర వీరేందర్ రెడ్డి కోడలిగా రాజకీయ రంగంలోకి అడుగుపెట్టిన విశాల, తన ప్రత్యేక నాయకత్వ శైలితో కేశంపేట్ రాజకీయాల్లో గుర్తింపు పొందారు. మహిళలు రాజకీయాల్లో ముందుకు రావడం కష్టమనే అపోహలను చెరిపేస్తూ, స్వయంకృషితో ఎదిగిన నాయకురాలిగా నిలిచారు.

చదువుకున్న నేతగా గుర్తింపు
ఉన్నత విద్యావంతురాలైన విశాల, మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నప్పటికీ ప్రజాసేవ లక్ష్యంగా రాజకీయాల్లోకి వచ్చారు. కళాశాల దశ నుంచే నాయకత్వ లక్షణాలు కనబరిచిన ఆమె, అనంతరం జడ్పిటిసిగా పోటీ చేసి ఘన విజయం సాధించారు. గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజా సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి కృషి చేశారు.
కాంగ్రెస్ పార్టీలో చేరిక
మారుతున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో, గత అసెంబ్లీ ఎన్నికల ముందు ఆమె Rahul Gandhi సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ విజయానికి కృషి చేస్తూ పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు. సేవా కార్యక్రమాల్లో ముందుండి సామాజిక బాధ్యతను చాటుకున్నారు.
ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ, తిరిగి కేశంపేట్ నుంచి పోటీ చేస్తారా? లేక ఎంపీపీ పదవిపై దృష్టి సారిస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది. ఏదేమైనా, ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కోటరిలో ముఖ్య నాయకురాలిగా విశాల స్థానం ప్రత్యేకమని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
లోకల్‌గైడ్ తరపున హ్యాపీ బర్త్‌డే విశాల గారు..!
సేవా పథంలో మరిన్ని విజయాలు సాధించాలని ఆశిస్తూ.
Tags:
About The Author
Latest News
03 Mar 2026 14:43:01
లోకల్ గైడ్ కేశంపేట్:
సేవా భావంతో చిరునవ్వును పంచుతూ తన జన్మదినాన్ని ప్రత్యేకంగా జరుపుకున్నారు కేశంపేట్ మాజీ జెడ్పిటిసి తాండ్ర విశాల శ్రవణ్ రెడ్డి. నందిగామ బైపాస్...
