తాండూర్ పాలక వర్గానికి ఘన సన్మానం.

ఏఎస్ జీఎంకే చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సన్మానం. 

తాండూర్ పాలక వర్గానికి ఘన సన్మానం.

ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి. 

లోకల్ గైడ్ /తాండూర్:
నూతనంగా కొలువుదీరిన చైర్ పర్సన్, వైస్ చైర్మన్ కౌన్సిలర్ల పాలకవర్గానికి ఏఎస్ జిఎంకే చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు ముజీబ్ ఖాన్ ఆధ్వర్యంలో సోమవారం శాలువా ,పూలదండలతో ఘనంగా సన్మానించారు. ఈ సన్మాన కార్యక్రమానికి తాండూర్ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నా రెండేళ్ల పాలనకు మున్సిపల్ ఎన్నికల ఫలితాలే నిదర్శనం అనే ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో తాండూర్ పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. ఇందుకోసం నూతనంగా ఎన్నికైన చైర్ పర్సన్, వైస్ చైర్మన్ లతో పాటు కౌన్సిల్ సభ్యులతో కలిసి ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. ముఖ్యంగా తాండూరులో ఏఎస్ జీఎంకే చారిటబుల్ ట్రస్ట్ అందిస్తున్న సేవలు అమోఘమని కొనియాడారు. నిరుపేద విద్యార్థులకు, నిరుద్యోగ యువతకు, వంటింటికే పరిమితమైన మహిళలకు, స్కూల్ విద్యార్థులకు ఉచిత కంప్యూటర్ శిక్షణ, టైలరింగ్, ఉచిత ట్యూషన్, వంటి శిక్షణలతో పేదలకు అండగా నిలబడుతున్నారని అన్నారు. వీటన్నింటి వెనుక మహా శక్తిలా ప్రకాశించే ముజీబ్ ఖాన్ భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అభినందించారు. సమాజంలో అనేకమంది డబ్బున్న వారు ఉంటారు. కానీ సేవ చేసే గుణం కొందరికి మాత్రమే ఉంటుంది. అందులో ముజీబ్ ఖాన్ ఏఎస్ జిఎంకే చారిటబుల్ ట్రస్టు మొదటి స్థానంలో ఉంటుందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ జీఎంకే చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు బుజీబ్ ఖాన్, చైర్ పర్సన్ నీరజ బాల్రెడ్డి, వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్, డిసిసి అధ్యక్షులు ధారాసింగ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అబ్దుల్ రాహుఫ్, కరణం పురుషోత్తం, మైనార్టీ పెద్దలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

రివార్డు పాయింట్ల పేరుతో సైబర్ మోసాలు. రివార్డు పాయింట్ల పేరుతో సైబర్ మోసాలు.
లోకల్ గైడ్/బంట్వారం: బ్యాంక్ రివార్డు పాయింట్ల పేరుతో సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారని బంట్వారం ఎస్సై విమల, మండల ప్రజలను హెచ్చరించారు. ఈ మేరకు...
ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం.
శ్రీరామ పాద క్షేత్రం అధ్యక్షుడుగా చిత్తయ్య గౌడ్
ఎస్సీ ఎస్టీ కౌన్సిలర్లకు ఘన  సన్మానం
రైతుల కస్టర్జీతం రైతులకే దక్కాలి 
ఎస్ సీ వర్గీకరణ పోరులో అసువులు బాసిన అమరవీరులకు జోహార్లు  
పేట జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ అమలు