సావిత్రిబాయి ఫూలే జయంతి సందర్భంగా వైద్య సేవా రంగంలో విశిష్ట సేవలకు అవార్డు

డాక్టర్ శ్రీధర్ రెడ్డికి ముఖ్య అతిథిగా అవార్డు ప్రదానం

సావిత్రిబాయి ఫూలే జయంతి సందర్భంగా వైద్య సేవా రంగంలో విశిష్ట సేవలకు అవార్డు

శేరిలింగంపల్లి, (లోకల్ గైడ్ ప్రతినిధి కృష్ణ):

సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా వైద్య, స్వచ్ఛంద సేవా రంగాలలో విశిష్ట సేవలు అందించిన డాక్టర్ శ్రీధర్ రెడ్డికి ఘన సన్మానం నిర్వహించి అవార్డును అందజేశారు. సమాజ సేవ పట్ల నిబద్ధతతో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించిన ఆయనకు ఈ అవార్డు ప్రదానం చేయడం గర్వకారణమని నిర్వాహకులు తెలిపారు. విద్యార్థుల అభ్యున్నతిని లక్ష్యంగా పెట్టుకుని డాక్టర్ శ్రీధర్ రెడ్డి ఉచిత వైద్య శిబిరాలు, ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు, విద్యా ప్రోత్సాహ కార్యక్రమాలు నిర్వహిస్తూ సమాజంలో ప్రత్యేక గుర్తింపు పొందారు. ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు ఉచిత సేవలు అందిస్తూ వారికి మార్గదర్శకత్వం చూపిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ రామస్వామి యాదవ్ మాట్లాడుతూ..సమాజానికి అంకితభావంతో సేవలందిస్తున్న డాక్టర్ శ్రీధర్ రెడ్డి వంటి వ్యక్తులు యువతకు ఆదర్శమని పేర్కొన్నారు. అనంతరం ఆయన చేతుల మీదుగా డాక్టర్ శ్రీధర్ రెడ్డికి అవార్డు ప్రదానం చేశారు. సావిత్రిబాయి ఫూలే జయంతి వేడుకల సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, సంఘ సభ్యులు పాల్గొని డాక్టర్ శ్రీధర్ రెడ్డిని అభినందించారు.

Tags:

About The Author

Latest News