భవన నిర్మాణ కార్మికుల సమస్య లపై మార్చి 30వ తేదీన చలో హైదరాబాద్.
సీఐటీయూ బి సి డబ్ల్యూ రంగారెడ్డి జిల్లా కమిటీ సభ్యురాలు కాట్రావత్ కవిత విమర్శించారు.
భవన నిర్మాణ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నాయని సీఐటీయూ బి సి డబ్ల్యూ రంగారెడ్డి జిల్లా కమిటీ సభ్యురాలు కాట్రావత్ కవిత విమర్శించారు. భవన నిర్మాణ కార్మికుల సమస్య ల పరిష్కారం కోసం ఈ నెల 30వ తేదీన జరిగే చలో హైదరాబాద్ కమీషనర్ కార్యాలయం కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్బంగా శనివారం రాజేంద్రనగర్ బుద్వేల్ లేబర్ అడ్డా దగ్గర మార్చి 30న జరగబోయే చలో హైదరాబాద్ కమిషనర్ కార్యాలయం కార్మికులతో కలిసి పోస్టర్ ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి భవన నిర్మాణ కార్మికులందరూ తప్పనిసరి హాజరుకావాలని పిలుపునిచ్చారు. CSC హెల్త్ టెస్టుల పేరుతో కార్మికులను మోసం చేస్తున్నారని, వారు చేసే టెస్టుల వలన కార్మికులకు ఎలాంటి ఉపయోగం లేదన్నారు ఉచిత టెస్టుల పేరుతో 349 కోట్ల రూపాయలను దుర్వినియోగం చేశారని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రైవేటీకరణ చేయరాదని డిమాండ్ చేశారు. సహజ మరణం, ప్రమాద మరణం బీమా ఈ రెండింటిని ఇప్పటికే ప్రైవేటు సంస్థకు అప్పజెప్పడం వల్ల కార్మికులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. కార్మికుల కోసం కొనసాగుతున్న మిగతా పథకాలను కూడా ప్రైవేటు శక్తులకు అప్పగించే ప్రయత్నం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. కార్మికుల డబ్బులను కొత్త పథకాల పేరుతో కార్మికులకు అందించాలని వారి పిల్లల చదువుల కోసం స్కాలర్షిప్లు ఇవ్వాలని, బిల్డింగ్ కార్మికునికి సొంత ఇంటి నిర్మాణం కోసం లోను మంజూరు చేయాలని, లేబర్ అడ్డాల దగ్గర మంచినీటి సౌకర్యం శ్రద్ధ నిర్మాణాలు చేపట్టాలని, 2009 ఇన్సూరెన్స్ కార్డుల రెన్యువల్ వెంటనే పూర్తి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అడ్డా అధ్యక్షులు అన్నపురం నర్సింగ్, ఎం.యాదయ్య చింటూ నాయక్ మొగిలి కృష్ణ అనిత శాంతమ్మ శ్రీనివాస్ వెంకటయ్య మొదలవు కార్మికులు పాల్గొన్నారు
