హెల్మెట్ వాడకం ప్రాణరక్షణకు కవచం
సిద్దిపేటలో పోలీసులకు హెల్మెట్ పంపిణీ
సిద్దిపేట జిల్లా ప్రతినిధి(లోకల్ గైడ్ తెలంగాణ)
మార్చి28:సిద్దిపేట త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌లో రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించేందుకు “Arrive Alive”ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.సిద్దిపేట ఎ.సి.పి. ఎం. రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో, మహీంద్రా ట్రాక్టర్ షోరూం మరియు రాయల్ ఎన్ఫీల్డ్ షోరూం సహకారంతో పోలీస్ సిబ్బందికి హెల్మెట్‌లను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎ.సి.పి. మాట్లాడుతూ హెల్మెట్ ధరించడం ప్రతి ఒక్కరి భాద్యత అని, ఇది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణనష్టాన్ని తగ్గించడంలో కీలక పాత్ర
పోషిస్తుందని తెలిపారు. పోలీస్ సిబ్బంది ముందుగా హెల్మెట్ వినియోగంలో ఆదర్శంగా నిలవాలని సూచించారు.కమిషనర్ ఆఫ్ పోలీస్ సాధన రష్మి పేర్మల్ ఐపీఎస్ ఆదేశాల మేరకు పోలీస్ సిబ్బంది భద్రత, ఆరోగ్య పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. ఆరోగ్య కాపాడేందుకు రక్త పరీక్షలు, వైద్య సలహాలు వంటి కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నట్లు వెల్లడించారు.ఈ కార్యక్రమంలో త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ టి. లక్ష్మీబాబు, ఎస్‌ఐలు చంద్రయ్య, మల్లేశం, పోలీస్ సిబ్బంది మరియు షోరూం ప్రతినిధులు పాల్గొన్నారు.
