తప్పుడు కేసుల గతిశీలతపై జాతీయ సదస్సు

వేదిక కానున్న గీతం అనుబంధ కౌటిల్య స్కూల్ ఆఫ్ పబ్లిక్

తప్పుడు కేసుల గతిశీలతపై జాతీయ సదస్సు

పాలసీ పత్ర సమర్పణకు ఆహ్వానం

పఠాన్ చేరు, (లోకల్ గైడ్ ప్రతినిధి):

హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం అనుబంధ సంస్థ-కౌటిల్య స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ ‘తప్పుడు కేసుల గతిశీలత (డైనమిక్స్)’ అనే అంశంపై రెండు రోజుల జాతీయ సమావేశాన్ని ఈ ఏడాది ఆగస్టు 21, 22 తేదీలలో నిర్వహించను న్నట్టు శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ సమావేశంలో పలువురు విద్యావేత్తలు, న్యాయ నిపుణులు, విధాన నిర్ణేతలు, పౌర సమాజ నిపుణులు కలిసి ‘తప్పుడు కేసులు’ అని పిలువబడే ఆరోపణల యొక్క చర్చ, చరిత్ర, అనుభవాలు, సామాజిక ప్రభావాన్ని పరిశీలించనున్నారు. ప్రత్యేకించి లింగం, చట్ట అమలు పద్ధతులు, ప్రజా అవగాహనలపై దృష్టి సారించనున్నట్టు వివరించారు. ఈ కార్యక్రమం చట్ట దుర్వినియోగం కథనం, న్యాయ వ్యవస్థలపై దాని ప్రభావాలు, దాని విస్తృత సామాజిక పరిణామాలపై ఆధారాల సహిత సంభాషణను పెంపొందించడం, ఇతర అధికార పరిధి నుంచి తులనాత్మక అంతర్దృష్టులను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఈ సమావేశంలో ఔత్సాహికులు పరిశోధనా పత్రాలను సమర్పించవచ్చని తెలియజేశారు. అమూర్త పత్రాలను (సారాంశాలను) ఫిబ్రవరి 20 లోగా సమర్పించాల ని, ఎంపిక చేసిన వాటిని మార్చి 5 నుంచి 14వ తేదీల మధ్య ఆన్ లైన్ ద్వారా ప్రదర్శించాలని, వాటిపై తుది అంగీకారాన్ని మార్చి 20 లోగా తెలియజేస్తా మన్నారు. ముసాయిదా (డ్రాఫ్ట్) పత్రాలను మే 15 లోగా సమర్పిస్తే, వాటిపై అభిప్రాయా న్ని జూన్ 15 లోగా తెలియజేస్తా మని, సవరించిన తుది పత్రాలను ఆగస్టు 1 లోగా సమర్పించాలని స్పష్టీకరించారు. ఈ సదస్సు హైదరాబాదులోని కౌటిల్య ప్రాంగణంలో జరుగుతుందన్నారు. భారతదేశం నుంచి పత్ర సమర్పణ చేసేవారు వ్యక్తిగతంగా పాల్గొనవచ్చని, అంతర్జాతీయ స్కాలర్లకు పరిమిత ఆన్ లైన్ భాగస్వామ్యం ఉంటుందని తెలిపారు. పరిశోధనా పత్రాలను conference@kspp.edu.in కు పంపవచ్చని, అదే మెయిలు ద్వారా ఇతర వివరాలు కూడా తెలుసుకోవచ్చని సూచించారు.

Tags:

About The Author

Latest News

నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే  నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే 
తొర్రూర్ (లోకల్ గైడ్ )తొర్రూర్ పట్టణంలోని బీఆర్ గార్డెన్ లో నిర్వహించిన తొర్రూర్ మున్సిపల్ మాజీ కౌన్సిలర్ దొంగరి రేవతి శంకర్  కుమార్తె వివాహ మహోత్సవ వేడుకలో...
రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా సిపిఆర్ పై 108 సిబ్బంది అవగాహన
ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత... జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాన్ని సందర్శించిన ఎమ్మెల్యే
ఘనంగా సద్గురు సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి వేడుకలు*
మానవత్వం చాటుకున్న పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి , టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి.
పేట కోర్టు ముందు 3వ రోజుకు చేరిన దీక్షలు