మిర్యాలగూడ ఫిబ్రవరి 14
(లోకల్ గైడ్, తెలంగాణ )
మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ జనరల్ మహిళకు రిజర్వేషన్ అయినందున జనరల్ స్థానంలో బీసీ మహిళకు కేటాయించి బీసీలకు న్యాయం చేయాలని, గతంలో కూడా టిఆర్ఎస్ ప్రభుత్వం జనరల్ స్థానంలో అగ్రవర్ణాలకే మున్సిపల్ చైర్మన్ మరియు వైస్ చైర్మన్ రెండింటిని అగ్రవర్ణాలకే కేటాయించి బీసీలను మోసం చేశారని కావున జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీలకు న్యాయం జరగాలంటే బీసీలకే మున్సిపల్ చైర్మన్ ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాం, మిర్యాలగూడ మున్సిపల్ పరిధిలో 48 వార్డులలో సగానికి పైగా బీసీలు గెలుపొందారని కావున అ జనాభా దామాషా ప్రకారం బీసీలకు మున్సిపల్ చైర్మన్ ఇవ్వాల్సిందేనని విజ్ఞప్తి చేస్తున్నాం అన్నారు గత మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ప్రస్తుత ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి బీసీలకు చైర్మన్ అవకాశం కల్పిస్తానని హామీ ఇచ్చారన్నారు.ఆ హామీని ఇప్పుడు నిలబెట్టుకోవాలన్నారు నలగొండ జిల్లాలో కేవలం ఒకే సామాజిక వర్గానికి చెందినవారు అన్ని పదవులు ఎమ్మెల్యే ఎంపీ మంత్రి పదవులు అనుభవిస్తున్నారని కనీసం చైర్మన్ లాంటి పదవులు అయినా బీసీలకు ఇచ్చి సామాజిక న్యాయం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో బిసి యువజన సంఘం పట్టణ కార్యదర్శి దోనేటి శేఖర్,బీసీ యువజన నాయకులు ఎస్పీ నాయుడు, రామకృష్ణ,నరేష్, రోహిత్,రవి, గోపాల్, వెంకటేష్, లవన్, క్రాంతి, శేఖర్, రమేష్, రాములు, సురేందర్,లక్ష్మీ,సుధా, అనురాధ, జ్యోతి,శ్వేత, రాధా, మహేశ్వరి, తదితరులు పాల్గొన్నారు.