బాధితులపై అక్రమ కేసులు దారుణం.
తెలంగాణ దళిత సమక్ష జిల్లా అధ్యక్షులు ఎదిరేపల్లి కాశన
లోకల్ గైడ్ నాగర్ కర్నూల్ జిల్లా
నాగర్ కర్నూల్ మండల పరిధిలోని కుమ్మెర గ్రామంలో జాతర సందర్భంగా జరిగిన వివాదంతో దళిత బడుగు బలహీన వర్గాలకు రక్షణగా నిలవవలసిన పోలీసులు బాధితులపై అక్రమంగా కేసులు నమోదు చేసి ఆ గ్రామానికి సంబందించిన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారికి వత్తాసు పలకడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని తీవ్రస్థాయిలో విరుచుకోపడ్డారు. గ్రామానికి చెందిన చంద్రకళ కుటుంబం దేవుడు దర్శనానికి వెళ్ళగా అదే గ్రామానికి చెందిన తుకారాం రెడ్డి శ్రీనివాస్ రెడ్డి శ్రీకాంత్ రెడ్డి సతీష్ రెడ్డి కన్ని రెడ్డి తో పాటు మరికొందరు వారిపై దాడి చేయడంతో పాటు సుమారు మూడు గంటల పాటు చిత్రహింసలకు గురి చేయడం సభ్య సమాజం తలదించుకునే సంఘటనగా ఆయన అభివర్ణించారు పోలీసులు నిందితులను శిక్షించవలసింది పోయి వారికి వత్తాసు పలుకుతూ బాధితుల పైన కేసులు నమోదు చేయడమే కాకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల నాలుగు నెలల చిన్నారి నిండు జీవితాన్ని బలి కావాల్సిన సంఘటన ఏర్పడిందని ఈ సంఘటనకు ఎవరు బాధ్యత వహిస్తారని ఆయన ప్రశ్నించారు వీటిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని మానవ హక్కులను కాపాడాలని ఆయన పోలీసులకు విజ్ఞప్తి చేశారు
