రాజేంద్రనగర్ సర్కిల్ మహనీయుల జయంతోత్సవాల నూతన కమిటీ ఎన్నిక.                                              

రాజేంద్రనగర్ సర్కిల్ మహనీయుల జయంతోత్సవాల నూతన కమిటీ ఎన్నిక.                                              

రాజేంద్రనగర్ (లోకల్ గైడ్ ):     

      రాజేంద్రనగర్ సర్కిల్ డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాల నూతన కమిటీ ( 2026  )ని ఎన్నుకున్నారు. శనివారం రాత్రి ప్రేమావతి పేట్ కమిటీ హాల్ వద్ద సంఘాల నాయకులు ఆధ్వర్యంలో ఈ నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఈ నూతన కమిటీ చైర్మన్ శివరాంపల్లి కి చెందిన దాసరి రమేష్,  వైస్ చైర్మన్ గా బుద్వేల్ కు చెందిననందిగామ నర్సింహా, ప్రధాన కార్యదర్శి గా మంగళారం శ్రీనివాస్,  కోశాధికారి గా పలుగుచెరువు మహేందర్ లను ఏకగ్రీవంగా పెద్దలు,  సలహాదారుల  సమక్షంలో ఎన్నుకోన్నట్లు ఈ కమిటీ చైర్మన్ దాసరి రమేష్ తెలిపారు. పూర్తిస్థాయి కమిటీని మరో రెండు మూడు రోజుల్లో ఎన్నుకోవడం జరుగుతుందన్నారు. తనపై నమ్మకంతో చైర్మన్ పదవికి ఏకగ్రీవంగా ఎన్నుకున్న పెద్దలందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు.

Tags:

About The Author

Latest News