మహిళా సాధికారతకు ఆర్థిక స్వాలంబనే మార్గం-సిపిఐ జిల్లా

మాజీ కార్యదర్శి పుస్తకాల నర్సింగరావు. 

మహిళా సాధికారతకు ఆర్థిక స్వాలంబనే మార్గం-సిపిఐ జిల్లా

.  
 రాజేంద్ర నగర్, ( లోకల్ గైడ్ ):                                    మహిళా సాధికారతకు ఆర్థిక స్వాలాంబానే మార్గమని సీపీఐ రంగారెడ్డి జిల్లా మాజీ కార్యదర్శి పుస్తకాల నర్సింగ్ రావు అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆదివారం రాజేంద్రనగర్ బుద్వేల్ ల్లోని సీపీఐ రంగారెడ్డి జిల్లా కార్యాలయం (దేవరాజ్ భవన్ )లో  భారత జాతీయ మహిళా సమాఖ్య రాజేంద్రనగర్ మండల అధ్యక్షురాలు మునేశ్వరి  ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిపిఐ జిల్లా మాజీ కార్యదర్శి పుస్తకాలు నర్సింగ్ రావు మండల కార్యదర్శి కన్యగారి నర్సింహ్మరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ....మహిళలకు కేవలం చదువు మాత్రమే సరిపోదని, ఆర్థిక శక్తి తోడైనప్పుడే నిజమైన మహిళా సాధికారత సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. మహిళలపై ఇంకా వివక్షత కొనసాగుతూనే ఉందన్నారు. అన్ని రంగాల్లో మహిళలు రాణిస్తున్నప్పటికీ, సమాజంలో నేటికీ వివక్ష, వేధింపులు కొనసాగడం దురదృష్టకరమన్నారు. సంపన్న కుటుంబాల్లోని మహిళలు సైతం వీటికి బాధితులు అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్య - క్రమశిక్షణ ఒక మహిళ చదువుకుంటే ఆ కుటుంబం మొత్తం వెలుగులోకి వస్తుందని, పిల్లలకు చదువుతో పాటు మంచి క్రమశిక్షణను అందించడంలో మహిళల పాత్ర కీలకమని కొనియాడారు.
 ఆర్థిక స్వాలంబన దేశాభివృద్ధి: మహిళలకు సరైన ఉపాధి అవకాశాలు కల్పిస్తే తమ శక్తిసామర్థ్యాలను నిరూపించుకుంటారని, తద్వారా దేశాభివృద్ధి వేగవంతం అవుతుందని అన్నారు. మహిళల కొనుగోలు శక్తి పెరగడం వల్ల పారిశ్రామిక రంగం కూడా బలోపేతం అవుతుందని పేర్కొన్నారు.
 హక్కుల పోరాటం: మహిళలు తమ హక్కుల కోసం నిలబడాలంటే ఆర్థికంగా ఎదగడం అవసరము అని పిలుపునిచ్చారు.
అనంతరం సీనియర్ మహిళా నాయకురాలకు సన్మానం చేయడం జరిగింది సత్యమ్మకు పుష్పకు శాంతమ్మకు మణెమ్మకు యశోదకు శైలజకు   మహిళా మణులకు సన్మానం చేసిన వారు భారత జాతీయ మహిళా సమైక్య మండల అధ్యక్షురాలు మునేశ్వరి మండల ఉపాధ్యక్షురాలు కుక్కునూరు వాణి బుజ్జి ఊర్మిళ సన్మానం చేసినారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం ఏ రియాజ్ జిల్లా సమితి సభ్యులు జే ఆనంద్ గౌడ్ మండల సహాయ కార్యదర్శి విజయ ఆనంద్ గౌడ్  మండల కార్యాలయం కార్యదర్శి జి సత్యం మండల కౌన్సిల్ సభ్యులు సదానంద గౌడ్  పాండు కృష్ణ శీను నాగరాజు సారయ్య తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News