రోడ్డు బీటలు బారి కుంగుతున్న పట్టించుకోరా...

శుక్రవారం బెల్లంపల్లిలో పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతు

రోడ్డు బీటలు బారి కుంగుతున్న పట్టించుకోరా...

 


మంచిర్యాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్)

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి బస్తి నుండి వివిధ మండలాలకు వెళ్లే దారి రోడ్డు మొత్తం కృంగి,బీటలు భారీ పెద్ద పెద్ద రంధ్రాలు ఏర్పడినా అధికారులు పట్టించుకోవడం లేదని ఎంసిపిఐ యు జిల్లా సహాయ కార్యదర్శి పసులేటి వెంకటేష్ ఆరోపించారు.శుక్రవారం బెల్లంపల్లిలో పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతు ఈ దారి గుండా కళాశాలు,హాస్టళ్లకు విద్యార్థులు నిత్యం వెళ్తు ఉంటారని బైకులు,ఆటోలు,ఆ రంధ్రాలల్లో పడి జారీ పడి పెద్ద పెద్ద ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని,అయినా కూడా ఈ రోడ్డును అధికారులు పట్టించుకోకపోవడం సిగ్గుచేటని అన్నారు.ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి బీటలు బారిన రోడ్డుకు మరమ్మత్తులు చేయించి వివిధ మండలాలకు నిత్యం ప్రయాణాలు సాగించే ప్రజలకు ఎలాంటి ప్రమాదాలు సంభవించకుండా రోడ్డు మరమ్మతులు చేయించాలని సంబంధిత అధికారులను కోరారు.లేనియెడల పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఎంసిపిఐ యు బెల్లంపల్లి మండల కార్యదర్శి ఆరెపల్లి సతీష్,పట్టణ కార్యదర్శి ఆరెపల్లి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

తుర్మామిడి గ్రామంలో రంజాన్ తోఫాల పంపిణీ. తుర్మామిడి గ్రామంలో రంజాన్ తోఫాల పంపిణీ.
లోకల్ గైడ్/బంట్వారం: పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా బంట్వారం మండల పరిధిలోని తుర్మామిడి గ్రామంలో బుధవారం ముస్లిం మహిళలకు రంజాన్ తోఫాల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు....
నర్మెట్టలో రైతు ఉత్సవాలకు ఘన ప్రారంభం
_శ్రీ పరాభవనామ సంవత్సరం ఉగాది కవి పద్య సమ్మేళనం ఘనంగా
అంబేద్కర్ యువజన సంఘం నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక.
నూతన తెలుగు సంవత్సరము ను పురస్కరించుకుని
సర్వారం గ్రామంలో బస్సు రోజు వీర బ్రహ్మచారి గుండెపోటుతో మృతి. 
రేపే రైతు మేళా ప్రారంభం – ఏర్పాట్లలో అధికారుల బిజీ