పాఠశాలల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని చర్యలు తీసుకోండి -

రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నీకోలాస్. 

పాఠశాలల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని చర్యలు తీసుకోండి -


రాజేంద్ర నగర్, ( లోకల్ గైడ్ ):                                         పాఠశాలల్లో సమస్యలు రాకుండా అన్ని చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్, ఐ ఏ ఎస్ నవీన్ నికోలస్ సూచించారు. సోమవారం అత్తా పూర్ రాంబాగ్ లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన పాఠశాలలోని అన్ని తరగతి గదులను పరిశీలించి విద్యార్థులను ప్రశ్నించి వారి అభ్యాస స్థాయిలను పరిశీలించారు.
పాఠశాలలో బోధన విధానం, విద్యార్థుల అభ్యాస స్థాయిలపై ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. పాఠశాలలో ఎక్కడైనా లోపాలు ఉన్నట్లయితే వాటిని తక్షణమే సరిచేయాలన్నారు. అలాగే విద్యార్థుల అభ్యాస స్థాయిలను 15 రోజులలోపు మెరుగుపరచాలని ఆదేశించారు.
పాఠశాలలో పరిశుభ్రత పూర్తి స్థాయిలో నిర్వహించకపోవడం గమనించిన డైరెక్టర్ స్కావెంజర్‌ను వెంటనే తొలగించి పాఠశాల పరిశుభ్రతను మెరుగుపరచాలని ఆదేశించారు.
అదనంగా పాఠశాల అభివృద్ధి కార్యక్రమాల కోసం ఇన్నర్ రింగ్ రోడ్ ప్రాంతంలో ప్రతిపాదిత పాఠశాల స్థలాన్ని కూడా పరిశీలించారు.
ఈ సందర్శనలో మండల విద్యాధికారి కె. శంకర్ రాథోడ్ ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

ఎంతరాత్రి వరకైనా సరే ఆస్తి పన్ను వసూలు చేయాల్సిందే - షాద్ నగర్ మున్సిపాల్ కమిషనర్ అధికారులకు హుకుంజారీ. ఎంతరాత్రి వరకైనా సరే ఆస్తి పన్ను వసూలు చేయాల్సిందే - షాద్ నగర్ మున్సిపాల్ కమిషనర్ అధికారులకు హుకుంజారీ.
  ఆస్థి పన్ను వసూల్ కోసం ఇళ్లకు వెళ్లిన అధికారులకు సవా లక్షా ప్రశ్నలతో ముచ్చెమటలు పట్టిస్తున్న ఆస్తిపన్నుదారులు. కాలనీలో ఏం అభివృద్ధి చేశారని ఆస్తిపన్ను వసూలుకు
గాలి గూడెంలో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశo
కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి.
బిజ్వార్ లో సీసీ రోడ్డు పనులు ప్రారంభం 
ఛత్రపతి శివాజీ,అంబేద్కర్ విగ్రహావిష్కరణ భూమి పూజలో
హైదరాబాద్‌లో ఘనంగా ‘యువ భారత్ రన్ 2026’ నిర్వహణ – యువతలో ఫిట్‌నెస్, విలువలకు నూతన దిశ
శాసనసభలో ఆర్‌&బీ శాఖపై మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ప్రసంగం