సీనియర్ జర్నలిస్టు కేపీని మర్యాదపూర్వకంగా కలిసిన మున్సిపల్ చైర్మన్ అగ్గునూరు బసవేశ్వర్..

ఘనంగా సన్మానించిన కేపీ  తదితర మిత్ర బృందం.  అగ్గునూరు సేవతో ఆదర్శంగా షాద్ నగర్ - కెపి

సీనియర్ జర్నలిస్టు కేపీని మర్యాదపూర్వకంగా కలిసిన మున్సిపల్ చైర్మన్ అగ్గునూరు బసవేశ్వర్..

జర్నలిస్ట్ కేపీనీ సన్మానించిన మున్సిపల్ చైర్మన్..

IMG-20260217-WA0286( లోకల్ గైడ్ షాద్ నగర్)

మున్సిపల్ చైర్మన్ గా చరిత్ర ఉన్న అగ్గునురు కుటుంబం నుంచి వచ్చిన అగనూరు బసవేశ్వర్ ఆధ్వర్యంలో షాద్ నగర్ మున్సిపాలిటీ ఆదర్శంగా నిలుస్తుందని, అత్యున్నత ప్రగతిని గెలుస్తుందని జర్నలిస్ట్ కేపీ  అభిప్రాయపడ్డారు. మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికైన అగ్గునూరు బసవేశ్వర్ జర్నలిస్ట్ కేపీ వివాహ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇంటికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం పలికిన కేపీనీ ఆయనను ఘనంగా సత్కరించారు. అనంతరం కేపీ మాట్లాడుతూ చైర్మన్ గా బస్వం నేతృత్వంలో షాద్ నగర్ మున్సిపాలిటీ లో ప్రతి వార్డు అభివృద్ధి వైపు పయనిస్తుందని పూర్తిస్థాయిలో నమ్ముతున్నానని అన్నారు. సౌమ్యుడుగా, వివాదారహితుడుగా, ఆజాతశత్రువుగా అందరి మన్ననలు అందుకున్న బస్వం ఐదేళ్ల పాలనలో తనదైన ముద్రవేయాలని ఆకాంక్షించారు. జర్నలిస్టుగా అతని ప్రయాణానికి పూర్తిస్థాయిలో తన సహకారం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. వెల్జెర్ల సర్పంచ్ బాబు నాయక్, మాజీ ఎంపిటిసి భార్గవ్ కుమార్ రెడ్డి, జాంగారి రవి, కొత్తపేట ఉస్మాన్, జర్నలిస్టు దంపాల్ సింగ్ తదితరులు సన్మానించిన వారిలో ఉన్నారు. కెపి వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఆయన ఘనంగా సన్మానించారు. కుటుంబం సకల సంతోషాలతో, సంపూర్ణ ఆరోగ్యంతో వర్ధిల్లాలని ఆయన ఆకాంక్షించారు. చైర్మన్ గా జర్నలిస్టులకు నిరంతరం సహకరిస్తానని, అందరి సలహాలు సూచనలతో చైర్మన్ గా ముందుకు సాగుతానని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో 
 అగ్గనూరు నందు తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

వృద్ధాశ్రమంలో జన్మదిన వేడుకలు వృద్ధాశ్రమంలో జన్మదిన వేడుకలు
లోకల్ గైడ్   కేశంపేట్: సేవా భావంతో చిరునవ్వును పంచుతూ తన జన్మదినాన్ని ప్రత్యేకంగా జరుపుకున్నారు కేశంపేట్ మాజీ జెడ్పిటిసి తాండ్ర విశాల శ్రవణ్ రెడ్డి. నందిగామ బైపాస్...
_ఈ వరల్డ్ హియరింగ్ డే సందర్భంగా కోక్లియా ప్రపంచంలో తొలి మరియు ఏకైక స్మార్ట్ ఈయరింగ్ ఇంప్లాంట్ సిస్టమును భారత్ కు తీసుకువచ్చింది
మిర్యాలగూడలో ఘనంగా హోళీ సంబురాలు చేసిన.
ఘోర రోడ్డు ప్రమాదం.
శ్రీపాదరావు సేవలు చిరస్మరణీయం: వరంగల్ సీపీ
ప్రజావాణి సమస్యలను వెంటనే పరిష్కరించాలి. అదనపు కలెక్టర్ 
హోలీ పండుగను సంప్రదాయ పద్ధతుల్లో ప్రశాంతంగా జరు పుకోవాలి