కార్యసాధకుడు 'కేసీఆర్' బీఆర్ఎస్  అమలు చేసిన సంక్షేమ పథకాలు దేశానికే దిక్సూచి

మిర్యాలగూడలో ఘనంగా తెలంగాణ తొలి సీఎం.  కేసీఆర్‌ పుట్టినరోజు వేడుకలు 

కార్యసాధకుడు 'కేసీఆర్' బీఆర్ఎస్  అమలు చేసిన సంక్షేమ పథకాలు దేశానికే దిక్సూచి

ప్రజాప్రతినిధులతో కలిసి కేక్  కట్ చేసిన  మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు

 మిర్యాలగూడ ఫిబ్రవరి 17
 (లోకల్ గైడ్ తెలంగాణ )

తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ జాతిపిత  కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్)  కార్యసాధకుడు అని మిర్యాలగూడ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు అభివర్ణించారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ నిర్వర్తించిన కృషి చరిత్రాత్మకమని అన్నారు. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసినప్పుడు ప్రజలకు  ఇచ్చిన వాగ్దానాలే  కాకుండా ప్రకటించని హామీలను కూడా ఒక్కోటి నెరవేరవేర్చిన మాహానేత కేసీఆర్ అని కొనియాడారు.  కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా మిర్యాలగూడ పట్టణంలో రెడ్డి కాలనీలోని  బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన భారీ కేకును కట్ చేశారు. స్థానిక  ప్రజాప్రతినిధులంతా ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకొని కేసీఆర్ పుట్టినరోజును వేడుకలా నిర్వహించుకున్నారు. అనంతరం శెట్టిపాలెం, వేములపల్లి 
గ్రామాల్లో నిర్వహించిన రక్తదానం శిబిరాల్లో భాస్కర్ రావు పాల్గొని మాట్లాడారు. మిర్యాలగూడ నియోజకవర్గం నుంచి పలువురు  యువకులు రక్తదానం శిబిరంలో పాల్గొని రక్త దానం చేశారు.  ఈ సందర్భంగా భాస్కర్ రావు వారిని అభినందించారు.  బీఆర్ఎస్ చీఫ్  కేసీఆర్‌ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఎంతో అభివృద్ధి సాధించిందని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రవేశపెట్టిన పథకాలు రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాలకూ ఆదర్శంగా నిలుస్తున్నాయని తెలిపారు. తెలంగాణ మాదిరి దేశం కూడా అభివృద్ధి చెందాలంటే కేసీఆర్‌తోనే సాధ్యమవుతుందని ఆయన వెల్లడించారు. కార్యక్రమంలో   తెలంగాణ రాష్ట్ర ఆగ్రోస్ మాజీ చైర్మన్ తిప్పన విజయసింహా రెడ్డి, జిల్లా రైతు బంధు సమితి మాజీ  అధ్యక్షులు చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నల్లమోతు సిద్దార్థ, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు అన్నభీమోజు నాగార్జున చారి, యడవల్లి శ్రీనివాస్ రెడ్డి, షోయబ్, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు,  కేసీఆర్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News