సమన్వయంతోనే తొర్రూరు మున్సిపాలిటీని

చేజిక్కించుకున్నాంపాలకుర్తిలో సంబరాలు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఎంపీ కావ్య

సమన్వయంతోనే తొర్రూరు మున్సిపాలిటీని

 
 
పాలకుర్తి(లోకల్ గైడ్)
సమన్వయంతోనే తొర్రూరు మున్సిపాలిటీని చేజింగ్కించుకొని కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగురవేశామని ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి అన్నారు. తొర్రూర్ మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ గా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో మంగళవారం మండల కేంద్రంలో గల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కార్యకర్తలతో  టీపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమండ్ల ఝాన్సీ రెడ్డి, వరంగల్ ఎంపీ కడియం కావ్యలతో కలిసి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి బాణాసంచా కాల్ చెయ్ సంబరాలు జరిపారు. ఈ సందర్భంగా టిపిసిసి ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి, ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఎంపీ కావ్య లు మాట్లాడుతూ తొర్రూరు మున్సిపల్ ఎన్నికల్లో ప్రజాస్వామ్యమే గెలిచిందని తెలిపారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పగటి కలలు కన్నాడని, పగటి కలలతో పాటు వెన్నుపోటు కుట్రలకు చరమగీతం పాడి తొర్రూరు మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ లను డ్రా పద్ధతిలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిందని తెలిపారు. ఏడిచే మగాళ్లను ఎన్నటికీ నమ్మరాదని, ఏడిచి ప్రజలను మోసం చేయడంలో దయాకర్ రావు ఘనుడని ఆరోపించారు. తొర్రూరు మున్సిపాలిటీ ని కైవసం చేసుకునేందుకు అనేక కుట్రలు చేశాడని, కాంగ్రెస్ కార్యకర్తల పైకి బిఆర్ఎస్ కార్యకర్తలను ఉసిగలిపి భౌతిక దాడులకు పాల్పడ్డాడని ఆరోపించారు. కాంగ్రెస్ అంటేనే ప్రజలు, ప్రజలు అంటేనే కాంగ్రెస్ పార్టీ అని స్పష్టం చేశారు. డ్రా పద్ధతిలో కాంగ్రెస్ అభ్యర్థులే చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు సాధించుకోవడం ప్రజాస్వామ్యం కాంగ్రెస్ పార్టీ వైపు ఉందని స్పష్టమైందని తెలిపారు. ప్రతిష్టాత్మకంగా జరిగిన మున్సిపోల్ ఎన్నికల యుద్ధంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం అహర్నిశలు, శక్తివంచన లేకుండా, నిస్వార్థంతో కృషి చేశారని, తొర్రూరులో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురడమే లక్ష్యంగా పనిచేశారని తెలిపారు. పాలకుర్తి నియోజకవర్గం ప్రజల సహకారంతో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో దయాకర్ రావును ఎమ్మెల్యే యశశ్విని రెడ్డి కొట్టిన దెబ్బకు కోలుకోలేదని, 2026 తొర్రూరు మున్సిపాలిటీ ఎన్నికల్లో ఎంపీ కావ్య కొట్టిన దెబ్బకు లేవ లేని స్థితిలో పడిపోయాడని తెలిపారు. తొర్రూరు మున్సిపాలిటీ అగ్నిపరీక్షల ఎన్నికల్లో కార్యకర్తల కష్టానికి వెలకట్టలేమని, అదే స్ఫూర్తితో రాబోవు ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. తొర్రూరు మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ల ఎంపికకు కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలకు సమానంగా ఉన్నప్పటికీ డ్రా పద్ధతిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అదృష్టం వరించిందని తెలిపారు. తొర్రూరు మున్సిపాలిటీ ఎన్నికలు మరింత బాధ్యతను పెంచాయని, పాలకుర్తి నియోజకవర్గం వర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని స్పష్టం చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఆనందం లేదని, తొర్రూరు మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు డ్రాలో విజయం సాధించడంతో ఆనందానికి అవధులు లేకుండా పోయాయని ఎమ్మెల్యే తెలిపారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుండి రాజీవ్ గాంధీ చౌరస్తా వరకు ర్యాలీగా వెళ్లి మానసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఐలమ్మ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ లావుడియా మంజుల, తొర్రూరు మున్సిపల్ చైర్మన్ డి శ్రావణ్, వైస్ చైర్మన్ జ్యోతి, తొర్రూరు మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రాపాక సత్యనారాయణ, హమ్మియా నాయక్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు గిరగాని కుమారస్వామి గౌడ్, ధరావత్ సురేష్ నాయక్, కొడకండ్ల మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఎర్రబెల్లి రాఘవరావు, దేవస్థాన మాజీ చైర్మన్ చిలువేరు కృష్ణమూర్తి,
పాలకుర్తి సొసైటీ మాజీ చైర్మన్ వీరమనేని యాకాంతరావు,
సర్పంచులు లోని శ్రీనివాస్, గాదరి కుమార్, కారుపోతుల శ్రీనివాస్ గౌడ్, మాజీ ఉపసర్పంచ్లు మారం శ్రీనివాస్, మారుజోడు సంతోష్, వల్లెపు రవి లతోపాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News