ఇచ్చిన మాట ప్రకారం షెడ్డును ఏర్పాటు చేశాం
గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి.
గద్వాల, లోకల్ గైడ్:
మున్సిపాలిటీ ఎన్నికలలో భాగంగా దేవాలయం నందు షెడ్డు నిర్మాణం చేస్తామని చెప్పిన మాట ప్రకారం నిర్మాణం చేసినట్లు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తెలిపారు. అమావాస్య సందర్భంగా మంగళవారం జిల్లా కేంద్రంలోని 28వ వార్డు షేరెల్లీవీధి నందు ఆంజనేయ స్వామి దేవాలయం, 32వ వార్డు శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు మున్సిపల్ ఛైర్ పర్సన్ తుమ్మల జయలక్ష్మి, వైస్ చైర్మన్ శంకర్ పాల్గొన్నారు. 28వ వార్డు షేరెల్లీ వీధిలో శ్రీ చౌలకాయ ఆంజనేయ స్వామి ఆలయం నందు నూతన షెడ్డును ప్రారంభించారు. అనంతరం అమావాస్య సందర్భంగా ఆలయంలో ఏర్పాటుచేసిన అన్నదాన కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, భక్తులతో కలిసి ఎమ్మెల్యే భోజనం చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..నూతన మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నికైన సందర్భంగా కౌన్సిలర్ ప్రమాణ స్వీకారం అనంతరం మొట్టమొదటి కార్యక్రమం శ్రీ చౌలకాయ ఆంజనేయస్వామి దేవాలయం షెడ్డు ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. భవిష్యత్తులో గద్వాల పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించి పట్టణాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దేం దుకు నా వంతు సాయశక్తుల కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సీనియర్ నాయకులు గడ్డం కృష్ణారెడ్డి, పటేల్ ప్రభాకర్ రెడ్డి, జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు రాజశేఖర్ , మున్సిపల్ చైర్ పర్సన్ తుమ్మల జయలక్ష్మి నరసింహులు యాదవ్, వైస్ చైర్మన్ శంకర్, కౌన్సిలర్స్ చంద్రశేఖర్, గోవిందు, సత్యం, ముత్యాల లక్ష్మి, మాజీ కౌన్సిలర్ మురళి, ఇసాక్, నాయకులు సాయి శ్యామ్ రెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డి, రిజ్వాన్, మొయినుద్దీన్, వినోద్ లోకేష్, రవి, ప్రవీణ్, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
