రక్తపు చారలు లేని రోడ్లే లక్ష్యం కావాలి

పేట సీఐ శివశంకర్. 

రక్తపు చారలు లేని రోడ్లే లక్ష్యం కావాలి

నారాయణపేట ఏప్రిల్ 13:
రోడ్డు ప్రమాదాలు నివారించి రక్తపు చారలు లేని రహదారులు లక్ష్యం కావాలని నారాయణపేట సి ఐ శివశంకర్ అన్నారు. సోమవారంఅరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా నారాయణపేట టౌన్ ఎస్సై వెంకటేశ్వర్లు,రూరల్ ఎస్సై సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో రోడ్డు భద్రత కమిటీలు ఏర్పాటు చేశారు.రోడ్డు భద్రత నియమాలు పాటిం చాలని గ్రామ సభలలో ప్రతిజ్ఞ చేయించారు.
జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ఆదేశాల మేరకు 
అరైవ్ అలైవ్ కార్యక్రమం 4వ దశలో భాగంగా  నారాయణ. పేట టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో,నారాయణపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోనీ ప్రతి గ్రామంలో రోడ్డు భద్రత నియమాలు పాటించాలని, రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా అవగాహన కార్యక్రమలు నిర్వహించారు. ప్రతి గ్రామంలో గ్రామ పంచాయతీ వద్ద గ్రామ సభ నిర్వహించి అందులో గ్రామ కార్యదర్శి, గ్రామ సర్పంచ్, గ్రామ ప్రజల, రిటైర్డ్ ఉద్యోగులు, అంగన్వాడి టీచర్లు, ఆశ వర్కర్లతో గ్రామ కమిటీలు ఏర్పాటు చేసి రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవా లని అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా  రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు వివరంగా అవగా హన కల్పించమనీ   తెలి పారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ముఖ్యంగా గ్రామ కమిటీలు రోడ్డు ప్రమాదాలను కట్టడి చేయడానికి ఏర్పాటు చేయడం జరుగుతుందని ఈ కార్యక్రమాన్ని మండలంలోని ప్రతి గ్రామంలో నిర్వహించ డం  జరిగిందని తెలిపారు. రక్తపు చారలు లేని రోడ్లే లక్ష్యంగా విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నామని అదేవిధంగా ప్రతి ఒక్కరు డిఫెన్స్ డ్రైవింగ్ చేయాలని తెలిపారు. రోడ్డు ప్రమాదాల నునివారించాలంటే ప్రతి ఒక్కరు రోడ్డు భద్రత నియ మాలు పాటించాలని హెల్మెట్ ధరించడం, సీటు బెల్ట్ వినియోగం, మద్యం తాగి వాహనం నడపకూడదని, వేగ పరిమితులు పాటించా లని సూచించారు. అదేవిధం గా గ్రామంలో రోడ్డు భద్రతపై నిరంతరం పర్యవేక్షణ జరపడానికి ప్రత్యేకంగా “రోడ్డు భద్రత కమిటీ”ని ఏర్పాటు చేశాము అన్నారు. ఈ కమిటీ గ్రామస్థులతో కలిసి రోడ్డు నియమాలు అమలు అయ్యేలా చర్యలు తీసుకుంటుందని తెలిపారు.
కార్యక్రమం చివరలో గ్రామ ప్రజలందరూ రోడ్డు భద్రతా నియమాలు తప్పనిసరిగా పాటిస్తామని ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమం ద్వారా గ్రామంలో రోడ్డు ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యమని అధికారులు తెలిపారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రెటరీ, సర్పంచ్ లు గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు మరియు ఇతర ప్రజలు పాల్గొన్నారు.
ఫోటో రైట్ అప్:3.ప్రజలతో ప్రతిజ్ఞ చేయించిన పోలీసులు
_______________________
Tags:

About The Author

Latest News

సీతారామ ప్రాజెక్టు బాట పట్టిన మంత్రి తుమ్మల సీతారామ ప్రాజెక్టు బాట పట్టిన మంత్రి తుమ్మల
లోకల్ గైడ్: ఖమ్మం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలోని ములకలపల్లి మండలంలోని కమలాపురం నుండి అన్నపరెడ్డిపల్లి మండలంలోని తొట్టి పంపు వరకు సుమారు 20 కిలోమీటర్ల మేర ఉన్న...
తెలంగాణ రాష్ట్రంలోని వివిధ పాఠశాలలకు చెందిన
గ్రోఫోలియో గ్రాండ్ లాంచ్
రంగారెడ్డి జిల్లాలో జర్నలిస్టుల సమన్వయానికి కీలక అడుగు
రంగారెడ్డి జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ ఏర్పాటు.
బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ కూటమికి మహిళలే బుద్ధి చెబుతారు
ఎండాకాలం జాగ్రత్తలు తెలియజేయాలి.