దుబ్బతండ లో ముమ్మరంగా శానిటేషన్ పనులు
సర్పంచ్ మత్రు నాయక్ ఆధ్వర్యంలో
By Ram Reddy
On
ఖమ్మం జిల్లా, కారేపల్లి : లోకల్ గైడ్, ఫిబ్రవరి 17 :
గ్రామ పంచాయతీ కార్మికులతో కలిసి రహదారులను శుభ్రపరచడం, చెత్తను తొలగించడం, కాలువల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లించడం వంటి కార్యక్రమాలు నిర్వహించారు.
ప్రజలకు పరిశుభ్రత ప్రాముఖ్యతను తెలియజేస్తూ, ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.
సర్పంచ్ ఆంగోత్ మత్రు చురుకైన నాయకత్వం, సేవాభావం, గ్రామాభివృద్ధి పట్ల ఉన్న నిబద్ధతకు గ్రామ ప్రజలు అభినందనలు తెలిపారు. గ్రామం పరిశుభ్రంగా, ఆరోగ్యకరంగా ఉండేందుకు ఇలాంటి కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Tags:
About The Author
Latest News
03 Mar 2026 14:43:01
లోకల్ గైడ్ కేశంపేట్:
సేవా భావంతో చిరునవ్వును పంచుతూ తన జన్మదినాన్ని ప్రత్యేకంగా జరుపుకున్నారు కేశంపేట్ మాజీ జెడ్పిటిసి తాండ్ర విశాల శ్రవణ్ రెడ్డి. నందిగామ బైపాస్...
