నారాయణపేట ఫిబ్రవరి 17:
నారాయణపేట పట్టణం మూడవ వార్డులో లోల్టేజి తో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని వెంటనే స్పందించి సమస్య పరిష్కరించాలని మూడవ వార్డు కౌన్సిలర్ కాకర్ల నారాయణమ్మ విద్యుత్ శాఖ ఎస్సీ నవీన్ కుమార్ ను కోరారు.మంగళవారం ఆయన కార్యాలయంలో కలిసి ఎస్సీ నీ సన్మానించారు.ఈ సందర్భంగా ఆమె వార్డులో విద్యుత్ సమస్యపై వివరిస్తూ అదనపు ట్రాన్స్ ఫార్మర్లు ఏర్పాటు చేసి లోల్టేజి సమస్యను పరిష్కరించాలని కొత్తగా ఏర్పాటు చేసిన స్తంభాలకు కరెంట్ తీగలు అమర్చాలని కోరారు.కాగా నూతనంగా కౌన్సిలర్ గా ఎన్నికైన కాకర్ల నారాయణమ్మ ను ఎస్సీ నవీన్ శాలువాతో సన్మానించి సమస్యలను త్వరగా పరిష్కరిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏ ఈ మహేష్, సిబ్బంది పాషా,మల్లేష్,సందీప్,చందు తదితరులు పాల్గొన్నారు.
ఫోటో రైట్ అప్:2:ఎస్సి నీ సన్మానించిన కౌన్సిలర్ నారాయణమ్మ,3.కౌన్సిలర్ ను సన్మానించిన ఎస్సీ.నవీన్
_____________________