విద్యార్థుల సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఎస్ఎఫ్ఐ పదవ తరగతి టాలెంట్ టెస్ట్ 

విద్యార్థుల సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఎస్ఎఫ్ఐ పదవ తరగతి టాలెంట్ టెస్ట్ 


ఖమ్మం : లోకల్ గైడ్ 
 ప్రముఖ వైద్యురాలు యార్లగడ్డ రజితIMG-20260211-WA0134

 గత 40 సంవత్సరాలుగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో టాలెంట్ టెస్ట్ నిర్వహణ

 ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి
 టి.ప్రవీణ్

 పదవ తరగతి విద్యార్థులకు టాలెంట్ టెస్ట్ నిర్వహించడం అభినందనీయం

 త్రివేణి పాఠశాల ప్రిన్సిపల్ రాజేంద్రప్రసాద్

 భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఖమ్మం నగర కేంద్రంలో త్రివేణి పాఠశాలలో పదవ తరగతి టాలెంట్ టెస్ట్ పేపర్ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన  ప్రముఖ కిమ్స్ హాస్పిటల్ వైద్యురాలు యార్లగడ్డ రజిత పేపర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు రాజు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో డాక్టర్ రజిత మాట్లాడుతూ విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు విద్యార్థులకు పరీక్షల పైన ఉన్నటువంటి భయాన్ని పోగొట్టే దానికోసం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తున్నారని తెలియజేశారు. అదేవిధంగా నేటి అధునాతన కాలంలో విద్యార్థులు వారి మేధో శక్తిని పోటీ ప్రపంచానికి అనుగుణంగా పెంపొందించుకోవాలని విజ్ఞానవంతులుగా మేధావులుగా తయారవ్వాలని తెలిపారు. ఉద్యమాలతో పాటు విద్యార్థులకు టాలెంట్ టెస్ట్ లు పెట్టడం విద్యార్థులకు ఉపయోగమని అన్నారు. జిల్లా కార్యదర్శి ప్రవీణ్ మాట్లాడుతూ విద్యార్థుల హక్కుల కోసం వారి సమస్యలపై పోరాడమే కాకుండా గత 40 సంవత్సరాలుగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులకు పరీక్షల పైన ఉన్న భయాన్ని పోగొట్టేందుకు ఈ టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తున్నామని అదే రీతిలో ఈరోజు పట్టణ మండల స్థాయి టాలెంట్ జిల్లా వ్యాప్తంగా నిర్వహించామని తెలిపారు. ప్రిన్సిపల్ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా టాలెంట్ టెస్ట్ నిర్వహించడం అభినందనీయమని విద్యార్థులకు ఈ టెస్ట్ ద్వారా ఎంతో ఉపయోగం కలుగుతుందని తెలిపారు. ఈ పేపర్ ఆవిష్కరణ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యురాలు సంగీత జిల్లా సహాయ కార్యదర్శి సాత్విక జిల్లా కమిటీ సభ్యురాలు సింధు జిల్లా కమిటీ సభ్యులు శ్రీనాథ్ నాయకులు లోకేష్, రమణ,లోహిత్ కుమార్, సాయి,గోపి, హారిక, అశోక్, భరత్  తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

ఇందిరమ్మ నూతన గృహప్రవేశంనికి హాజరైన ఎన్కతల గ్రామ సర్పంచ్  ఇందిరమ్మ నూతన గృహప్రవేశంనికి హాజరైన ఎన్కతల గ్రామ సర్పంచ్ 
ఎన్కతల పటేల్ గారి శ్రీకాంత్ గౌడ్   మోమిన్ పెట్ మండల పరిధిలోని ఎన్కతల గ్రామంలో నూతన గృహప్రవేశానికి హాజరైన గృహప్రవేశ ఆహ్వానంలో ఎన్కతల సర్పంచ్ పటేల్ గారి...
సొంత గూటికి సత్తెన్న కందుకూరు మండలం నుంచి కాంగ్రెస్ లో చేరికలు.
మంచిర్యాల మేయర్ బాధ్యతల స్వీకరణ. 
నేడు ఆర్ ఎస్ ఎస్ ఆధ్వర్యం లో ప్రతిష్టత వ్యక్తుల సమా వేశం
వివాహ వేడుకల్లో పాల్గొన్న బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఎమ్మె సత్యనారాయణ.
ప్రధాని మన్ కీ బాత్ వీక్షించిన మున్సిపల్ చైర్ పర్సన్,బిజెపి నాయకులు
మిఠాయిలు పంచి కృతఙ్ఞతలు తెలిపిన చైర్ పర్సన్  శ్వేత సత్యయాదవ్