కారేపల్లి లో మాజీ సీ ఎం.కె సీ ఆర్ పుట్టినరోజు వేడుకలు

తెలంగాణ  తల్లి విగ్రహం వద్ద  నాయకులు  కేక్  కట్  చేసి స్వీట్లు  పంచిపెట్టారు.

కారేపల్లి లో మాజీ సీ ఎం.కె సీ ఆర్ పుట్టినరోజు వేడుకలు

ఖమ్మం జిల్లా, కారేపల్లి : లోకల్ గైడ్, ఫిబ్రవరి 17 :  

తెలంగాణ  రాష్ట్ర సాధకుడు  కేసీఆర్‌  జన్మదిన వేడుకలను ఖమ్మం జిల్లా  కారేపల్లి  మండల బీఆర్ఎస్  పార్టీ  ఆధ్వర్యంలో మంగళవారం  ఘనంగా జరుపుకున్నారు. మండల  కేంద్రంలోని బస్టాండ్  సెంటర్లో  గల  తెలంగాణ  తల్లి విగ్రహం వద్ద  నాయకులు  కేక్  కట్  చేసి స్వీట్లు  పంచిపెట్టారు. అనంతరం బీఆర్‌ఎస్‌  నాయకులు  మాట్లాడుతూ.. తెలంగాణ  రాష్ట్ర  సాధకుడుగా  కీర్తి గణించిన  మహోన్నత  వ్యక్తి  కేసీఆర్ అని, ప్రజా  రైతు  సంక్షేమమే  లక్ష్యంగా కేసీఆర్ పాలన కొనసాగిందని,దేశానికే ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రాన్ని నిలిపిన మహోన్నతుడుగా చరిత్ర సృష్టించిన వ్యక్తి కేసీఆర్ అని అన్నారు.
కార్యక్రమంలో మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ ముత్యాల సత్యనారాయణ,మాజీ జెడ్పిటిసిలు ఉన్నం వీరేందర్,వాంకుడోత్ జగన్, మాజీ వైస్ ఎంపీపీ రావూరి శ్రీనివాసరావు,మాజీ సొసైటీ వైస్ చైర్మన్,సర్పంచ్ ధరావత్ మంగీలాల్, నాయకులు బానోతు కుమార్,పిల్లి వెంకటేశ్వర్లు,డొంకన రవీందర్, తాత వెంకటేశ్వర్లు,భానోత్ రాందాస్, తెలంగాణ ఉద్యమ కారుడు సోమందుల నాగరాజు, జిమ్కిలాల్, పెద్ద బోయిన సురేష్, వీర్య నాయక్,  హచ్చు నాయక్,  నాగేశ్వరరావు, తాత ఉపేందర్,  శంకర్, ఖలీల్ ఉల్లాఖాన్,  రాము నాయక్, మాలోతు ప్రసాద్ , పేర్ని వెంకటేశ్వర్లు,  ధరావత్ రాజు, చింతల కృష్ణ, చింతల సంపత్ కుమార్,  భగవాన్ లాల్, పోతు రాములు, దుండి సైదులు, హారు నాయక్, మంగ్యా నాయక్, పిల్లలమర్రి  వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

రివార్డు పాయింట్ల పేరుతో సైబర్ మోసాలు. రివార్డు పాయింట్ల పేరుతో సైబర్ మోసాలు.
లోకల్ గైడ్/బంట్వారం: బ్యాంక్ రివార్డు పాయింట్ల పేరుతో సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారని బంట్వారం ఎస్సై విమల, మండల ప్రజలను హెచ్చరించారు. ఈ మేరకు...
ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం.
శ్రీరామ పాద క్షేత్రం అధ్యక్షుడుగా చిత్తయ్య గౌడ్
ఎస్సీ ఎస్టీ కౌన్సిలర్లకు ఘన  సన్మానం
రైతుల కస్టర్జీతం రైతులకే దక్కాలి 
ఎస్ సీ వర్గీకరణ పోరులో అసువులు బాసిన అమరవీరులకు జోహార్లు  
పేట జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ అమలు