మిర్యాలగూడ ఎమ్మెల్యే కి బీసీ సంఘాల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు.
బీసీ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తిరుమలగిరి అశోక్
By Ram Reddy
On
మిర్యాలగూడ ఫిబ్రవరి 17
(లోకల్ గైడ్,తెలంగాణ)
మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ జనరల్ మహిళగా రిజర్వ్ అయిన సందర్భంగా బీసీ మహిళలకు చైర్మన్ పదవి కేటాయించాలని బీసీ సంఘం పెద్ద ఎత్తున ఎమ్మెల్యే కి విన్నవించుకున్న సందర్భంగా ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఇచ్చిన మాట ప్రకారం బీసీలను గౌరవించి మున్సిపల్ చైర్మన్ గా శ్రీమతి చిలుకూరి సుధా బాలకృష్ణ కి మున్సిపల్ పీఠం కల్పించినందుకు వారికి ధన్యవాదాలు ఇలాగే బలహీన వర్గాలకు ఎల్లవేళలా సహకరిస్తూ పేద వర్గాలకు న్యాయం కల్పించే దిశగా మీరు ముందుకు సాగాలని ఆయన కోరారు జనరల్ మహిళగా రిజర్వ్ అయిన మున్సిపల్ పీఠం బీసీలకు కేటాయించడం నిజంగా హర్ష నీయం అయిన సందర్భం. బీసీ సంఘం తరఫున మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి కి, ఎంపీ రఘు రెడ్డి కి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని ఆయన అన్నారు.. కార్యక్రమంలో వెంకటేష్, అంజి, సతీష్, జక్కా నాగేశ్వరరావు, ఉమేష్ చంద్ర, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.
Tags:
