కారేపల్లి: లోకల్ గైడ్
కారేపల్లి మండల రేలకాయలపల్లికి చెందిన సీపీఐ(ఎం) నేత పిప్పళ్ళ కృష్ణ సతీమణి నాయకురాలు మాడె సుభద్ర (53) సోమవారం మృతి చెందారు . కొంత కాలంగా మూత్రపిండాల వ్యాధి తో బాధపడుతున్న సుభ్రద చికిత్స పొందుతూ మృతి చెందింది. మృత దేహాన్ని సీపీఐ (ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మెరుగు సత్యనారాయణ , జిల్లా కమిటీ సభ్యులు కొండబోయిన నాగేశ్వరరావు , మండల కార్యదర్శి కే. నరేంద్రలు సందర్శించి ఘనంగా నివాళ్లు ఆర్పించారు . ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ రేలకాయలపల్లి ప్రాంతంలో గిరిజనుల సమస్యలు , పోడు సమస్య , వ్యవసాయ కూలీ సమస్యలపై చేసిన పోరాటాలలో భర్త కృష్ణ వెన్నంటే ఉండి అతనికి ప్రోత్సహాన్ని అందించారన్నారు. ఎంపీటీసీ ఎన్నికలలో సైతం సీపీఐ (ఎం) తరపున నిలబడి సీపీఐ (ఎం) భావాజలాన్ని వివరించారన్నారు . సుభద్ర మరణం కుటుంబానినికే కాక పార్టీకి తీరని లోటన్నారు . మృతి దేహాన్ని సందర్శించిన వారిలో సీపీఐ (ఎం) నాయకులు వజ్జా రామారావు , మద్దెల నాగయ్య , జేత్రాoతండా సర్పంచ్ మూడు జయంతి , మాజీ ఎంపీటీసీ బానోతు మటుకు , వార్డు మెంబర్ హతీరాం తదితరులు ఉన్నారు.