రెండు వారాలు గడిచినా పూర్తి కాని స్పీడ్ బ్రేకర్ మరమ్మత్తులు

జోనల్ కమిషనర్ కార్యాలయానికి వెళ్లే దారిలో పనులపై ప్రజలలో అసంతృప్తి

రెండు వారాలు గడిచినా పూర్తి కాని స్పీడ్ బ్రేకర్ మరమ్మత్తులు

శేరిలింగంపల్లి, (లోకల్ గైడ్ ప్రతినిధి కృష్ణ):

జోనల్ కమిషనర్ కార్యాలయానికి వెళ్లే మార్గంలో ఇనుప గొట్టాలతో ఏర్పాటు చేసిన స్పీడ్ బ్రేకర్ మరమ్మత్తులపై ఆఫీసులకు వచ్చి వెళ్ళే ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రెండు వారాలు గడిచిన మరమ్మత్తు పనులు ఇంకా పూర్తికాకపోవడం స్థానిక ప్రజలలో అసంతృప్తిని కలిగిస్తోంది. సుమారు 20 రోజులు గడిచినా పనులు కొనసాగుతూనే ఉండటంతో ఆ మార్గంలో ప్రయాణించే వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా కార్యాలయానికి వచ్చే ప్రజలు, ఉద్యోగులు రోజూ రాకపోకలలో అసౌకర్యానికి గురవుతున్నారు.
పనులు ప్రారంభించిన తర్వాత కూడా ఇంతకాలం ఆలస్యం కావడం పట్ల స్థానికులు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. వెంటనే పనులను వేగవంతం చేసి పూర్తి చేయాలని నియోజకవర్గ ప్రజలు సంబంధిత అధికారులను కోరుతున్నారు. అధికారులు స్పందించి త్వరితగతిన మరమ్మత్తులు పూర్తి చేస్తే ప్రజలకు ఉపశమనం లభిస్తుందని వారు అభిప్రాయపడుతున్నారు.

Tags:

About The Author

Latest News

ఎకో హిల్ ప్రాంతాన్ని అంతర్జాతీయ ప్రాంత అభివృద్ధి; సీఎం రేవంత్ రెడ్డి. ఎకో హిల్ ప్రాంతాన్ని అంతర్జాతీయ ప్రాంత అభివృద్ధి; సీఎం రేవంత్ రెడ్డి.
శంషాబాద్ , మార్చ్ 6(లోకల్ గైడ్); రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమం స్ఫూర్తితో తొలి రోజు హిల్ పార్క్ ప్రారంభోత్సవం...
షాద్‌నగర్ సీఐ కే. సీతారాంను మర్యాదపూర్వకంగా కలిసిన
జిల్లా స్థాయి  బాలమేళాకు విద్యార్థుల ఎంపిక
శేరిలింగంపల్లి జిహెచ్ఎంసి కార్యాలయంలో ఏసీబీ సోదాలు
ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలి.
తెలంగాణ గ్రామీణ వైద్యుల సహాయక సంఘం 
వేంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే నాయిని..