హైదరాబాద్, (లోకల్ గైడ్ ప్రతినిధి కృష్ణ):
తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ అసోసియేషన్ అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న సీనియర్ అడ్వకేట్ చిక్కుడు ప్రభాకర్ కు మద్దతుగా నిర్వహించిన ప్రచార కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. ఈ కార్యక్రమంలో టీఆర్‌పీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ , ప్రముఖ అడ్వకేట్ సుదగాని హరిశంకర్ గౌడ్ పాల్గొని, ప్రభాకర్ కు తన పూర్తి మద్దతును ప్రకటించారు. న్యాయవాదుల సంక్షేమం, అసోసియేషన్ అభివృద్ధి కోసం ఆయన చేస్తున్న కృషిని ప్రశంసిస్తూ, ఈ ఎన్నికలలో విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఈ ప్రచార కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు, జూనియర్ న్యాయవాదులు పెద్ద ఎత్తున పాల్గొని, చిక్కుడు ప్రభాకర్ గెలుపును కాంక్షిస్తూ మద్దతు తెలిపారు. తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ అసోసియేషన్ ఎన్నికలలో అభ్యర్థులకు న్యాయవాదుల మద్దతు కీలక పాత్ర పోషిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రముఖ నాయకులు, న్యాయవాదులు కలిసి ప్రచారం చేయడం ప్రభాకర్ విజయావకాశాలను మరింత బలపరుస్తుందని భావిస్తున్నారు. విస్తృత స్థాయిలో జరుగుతున్న ప్రచారం, న్యాయవాదుల మద్దతుతో చిక్కుడు ప్రభాకర్ విజయం సాధించే అవకాశాలు మెరుగుపడుతున్నాయి. ఈ కార్యక్రమంలో అడ్వకేట్ సుధ గాని హరి శంకర్ గౌడ్ తో పాటు సీనియర్, జూనియర్ న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.