విశిష్ట ఫౌండేషన్ ఆధ్వర్యంలో 20వ వార్డులో చీరల పంపిణీ

గుర్రం సీతామాలక్ష్మి శ్రీనివాసరావు  

విశిష్ట ఫౌండేషన్ ఆధ్వర్యంలో 20వ వార్డులో చీరల పంపిణీ


  •  వైరా:లోకల్ గైడ
  • రంజాన్ పండుగను పురస్కరించుకొని ముస్లిం సోదరీమణులు పండుగను భక్తిశ్రద్ధలతో ఆనందంగా జరుపుకోవాలని ఖమ్మం జీవి మాల్ వారి విశిష్ట ఫౌండేషన్ నిర్వాహకులు గుర్రం సీతామహాలక్ష్మి శ్రీనివాస్ అన్నారు వైరా మున్సిపాలిటీ పరిధిలోని 20వ వార్డు నందు లయన్స్ క్లబ్ రీజన్ సెక్రెటరీ పెనుగొండ ఉపేంద్రరావు అభ్యర్థన మేరకు వార్డ్ కౌన్సిలర్ శ్రీమతి ఉండు వరలక్ష్మి శ్యాం బాబు అధ్యక్షతన జరిగిన  కార్యక్రమానికి హాజరైన గుర్రం సీతామహాలక్ష్మి మాట్లాడుతూ జీవి మాల్ వారి శతాబ్ది వేడుకల్లో భాగంగా 50 మంది ముస్లిం సోదరీమణులకు పదివేల రూపాయలు విలువ చేసే చీరలు పంపిణీ చేస్తూ ఆమె మాట్లాడినారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన వైరా మున్సిపాలిటీ చైర్పర్సన్ శ్రీమతి డాక్టర్ కాపా చంద్రకళ మాట్లాడుతూ విశిష్ట ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేదవారి గురించి ఆలోచించటం వారిని గుర్తించి పండుగ వేళ నూతన వస్త్రాలు ధరించి ఆనందంగా ఉండాలని ఆలోచనతో 20వ వార్డులో సేవా కార్యక్రమాలు నిర్వహించడం చాలా అభినందనీయమని రంజాన్ మాసము అంటేనే దానధర్మాలకు దాతృత్వాలకు మనకున్న దానిలో ఇతరులకు సహాయం చేయమని అర్థమని ఆమె మాట్లాడినారు. ఈ కార్యక్రమంలో జిఎంటి కోఆర్డినేటర్ లగడపాటి ప్రభాకర్, రీజన్ సెక్రెటరీ పెనుగొండ ఉపేంద్రరావు, జోన్ చైర్మన్ చింతోజు నాగేశ్వరరావు, జాల పుల్లారావు మహాలక్ష్మి ఉయ్యూరు రామకృష్ణ వార్డు సభ్యులు తదితరులు పాల్గొని ముస్లిం సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసినారు
Tags:

About The Author

Latest News

నాటక రచయితకు, నిర్వాహకులకు సన్మానం. నాటక రచయితకు, నిర్వాహకులకు సన్మానం.
*       ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి ఏప్రిల్01లోకల్ గైడ్    వరంగల్ రామన్నపేట లోని డాక్టర్.ఏ. రాజేంద్రప్రసాద్ భారతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పోతన ఆడిటోరియంలో ప్రదర్శించబడిన పూరి...
సకల మానవాళికి ప్రమాదం యుద్ధం
జిల్లా వ్యాప్తంగా 30పోలీస్ యాక్ట్ అమలు.....
ప్రజాప్రతినిధుల ఆశీస్సులతో ఘనంగా వివాహ వేడుక
46వ డివిజన్‌లో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన
ప్రజల మధ్యే సంక్షేమం…  నేరుగా లబ్ధిదారుల చేతికి కోట్ల చెక్కులు..
కార్మిక లేబర్ కోడ్ ల అమలును నిరసిస్తూ కాటేదాన్ చౌరస్తా