బీసీ 42 శాతం రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించకుండా, రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న బిజెపిని గద్దె దించాలి.

సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పాలడుగు నాగార్జున.

బీసీ 42 శాతం రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించకుండా, రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న బిజెపిని గద్దె దించాలి.

 


 

 నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి లోకల్ గైడ్

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలులో నిర్లక్ష్యంగా వ్యవహరించడమే కాకుండా, అమలుకు చట్టం చేయకుండా వాటికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న బీజేపీపై సామాజిక వర్గాలు, ప్రజలు చైతన్యం సాధించి ఢిల్లీ గద్దె దించాలని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పాలడుగు నాగార్జున పిలుపునిచ్చారు.దేశంలో అధికారంలో ఉన్న బిజెపి, 42 శాతం బీసీలకు రిజర్వేషన్లు కల్పించకుండా పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ చేయకపోవడం, బీసీల పట్ల వ్యతిరేక భావజాలాన్ని బహిర్గతం చేస్తోందని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో చేసిన తీర్మానంపై గవర్నర్ వెంటనే సంతకం చేయాలని డిమాండ్ చేశారు. కానీ గవర్నర్ బీజేపీకి తలొగ్గి బిల్లుపై నిర్ణయం తీసుకోవడం లేదని ఆయన విమర్శించారు.తెలంగాణ నుండి బీజేపీకి చెందిన 8 మంది ఎంపీలు పార్లమెంట్లో నోరు మెదపకపోవడం, కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ “బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయలేము” అని చెప్పడం సిగ్గుచేటు చర్య అని పేర్కొన్నారు. వెంటనే బండి సంజయ్ బీసీలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
బీహార్‌లో జరుగుతున్న ఎన్నికల్లో పెద్ద ఎత్తున నకిలీ ఓటర్లను సృష్టించి అధికారంలోకి రావడానికి రాజ్యాంగ హక్కులను ఉల్లంఘిస్తున్నారని ఆరోపించారు. బీజేపీ అధికారంలో ఉన్న అనేక రాష్ట్రాల్లో దళితులు, గిరిజనులు, మైనార్టీలు, అణగారిన వర్గాలపై దాడులు, దౌర్జన్యాలు జరుగుతున్నాయని, మనువాద భావజాలంతో రాజ్యాంగాన్ని మార్చే కుట్రలు చేస్తున్నారని తెలిపారు.బీసీల రిజర్వేషన్లను రద్దు చేయాలనే బీజేపీ యత్నాలను ప్రజలు అర్థం చేసుకుని, పెద్ద ఎత్తున పోరాటాల్లోకి రావాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశానికి మండల కమిటీ సభ్యులు కొండా వెంకన్న అధ్యక్షత వహించగా, సిపిఎం మండల కార్యదర్శి నలపరాజు సైదులు, జిల్లా కమిటీ సభ్యురాలు కొండ అనురాధ, మండల కమిటీ సభ్యులు పోలే సత్యనారాయణ, జిల్లా అంజయ్య, బుల్లు రవీందర్, మల్లెబోయిన రామలింగయ్య, కొత్త అంజయ్య, కట్ట అంజయ్య, మానుపాటి ఎల్లయ్య, రాములు తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News