వనపర్తి జిల్లా ఫిబ్రవరి 06 ( లోకల్ గ్రేడ్)
వనపర్తి మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా 8 వ వార్డులో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి నానావత్ లక్ష్మి వెంకటేష్ శుక్రవారం గడపగడపకు తిరిగి ప్రచారం చేశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాట్లాడుతూ... మున్సిపల్ ఎన్నికల్లో ఎగిరేది కాంగ్రెస్ జెండా నే అని ఆమె అన్నారు. కాంగ్రెస్ పార్టీ పెద్దలు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి,ఎమ్మెల్యే తూడి మెగా రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ కొత్త కాపు శివసేన రెడ్డి ఆశీస్సులతో సాగిన ఈ ప్రచారంలో, వనపర్తి అభివృద్ధి ప్రధాత ఎమ్మెల్యే తూడి మెగా రెడ్డి, కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకు ఓటు వేసి ప్రజలు నన్ను ఆశీర్వదించాలని కోరారు. హస్తం గుర్తుకు ఓటు వేయండి మీ అందరి ఆశీస్సులు మాపై ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను.8వ వార్డ్ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ నీ గెలవాల్సిన అవసరం ఎంతో ఉందని మిమ్మల్ని కోరుతున్నాను. మీ సమస్యలు సమస్యలుగా భావించి పిలిస్తే పలికే నాయకురాలినీ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి నానవత్ లక్ష్మీ వెంకటేష్ వార్డులో సీసీ రోడ్లు డ్రైనేజీలు కరెంటు లైన్ సమస్యలు సీసీ కెమెరాలు వీధి దీపాలు ఏర్పాటు చేయిస్తాను. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఉమ్మల్ల రాములు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఎన్నో సంక్షేమ పథకాలు ప్రజలకు ఉచిత సన్న బియ్యం, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, ఉచిత విద్యుత్తు, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, సీసీ రోడ్ల నిర్మాణం, అనేక సంక్షేమ కార్యక్రమాలు మన రాష్ట్ర తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ సర్కార్ చేసింది అని ఆయన అన్నారు.ఈ ప్రచారంలో ప్రజల నుంచి విశేష స్పందన లభించిందని, వార్డు ప్రజలు ఓటర్లు తమ మద్దతు ఉందని ఆయన స్పష్టం చేశారు. పెద్దగూడెం తాండ సర్పంచ్ వాల్య నాయక్ 8 వ వార్డు బూతు అధ్యక్షులు మాట్లాడుతూ... మన స్థానిక ఎమ్మెల్యే తుడి మెగా రెడ్డి మన వార్డులో ఎంతో అభివృద్ధి చేశారు. ఎమ్మెల్యే చేసిన అభివృద్ధికి మీరు ఈ అధికార పార్టీకి ప్రజలు అందరూ అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ, నాయకులు, పోలికల బాలస్వామి,మాజీ ఎంపీటీసీ శివ, వెల్డింగ్ నరసింహ, మండ్ల గోపాల్, పసుల సురేష్, చింతకుంట జయరాములు, ద్యావర్ల స్వామి, పోలికల చంద్రు, మొలకళపల్లి మద్దిలేటి, మాజీ సర్పంచ్ సిరివాటి సురేష్, సిరివాటి మసీకొండ, సిరివాటి పెద్ద ఎల్లయ్య,సిరివాటి శివాజి, యువకులు,కార్యకరలు, మహిళలు పెద్దలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు...