వనపర్తి జిల్లా ఫిబ్రవరి 06 ( లోకల్ గ్రేడ్ )
వనపర్తి మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో 8వ వార్డులో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మూడవత్ శంకరమ్మ బాబ్య నాయక్ గడపగడపకు ప్రచారం నిర్వహించి కారు గుర్తుకు ఓటు వేసి ప్రజలు మమ్మల్ని గెలిపించాలని కోరారు. బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాట్లాడుతూ.. ప్రచారంలో భాగంగా వారు ఓటర్లను ఓట్లు అభ్యర్థించారు. నిస్వార్ధంగా ప్రజాసేవ చేయాలన్న సంకల్పంతో రాజకీయల్లోకి వచ్చానని ఓటర్లతో వారన్నారు. వ్యవసాయ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చానని ప్రజల కష్టాలు తెలిసిన వ్యక్తిగా ప్రజా పాద సేవ చేస్తాను. మాజీ రైతుబంధు అధ్యక్షులు ద్యావర్ల నరసింహ మాట్లాడుతూ..గత పది సంవత్సరాలుగా బిఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు రాష్ట్రంలో సజీవంగా ఉన్నాయన్నారు.ప్రజల సంక్షేమమే లక్ష్యంగా అభివృద్ధి ధ్యేయంగా 8వ వార్డులో మిగిలిపోయిన పనులను మళ్లీ పునర్ ప్రారంభిస్తామని ఆయన అన్నారు. 8 వ వార్డును ఆదర్శవార్డుగా తీర్చిదిద్దేందుకు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మూడవత్ శంకరమ్మ బాబ్య నాయక్ కట్టుబడి ఉంటారని ఆయన అన్నారు.మాజీ మార్కెట్ యాడ్ డైరెక్టర్ బాలకిష్టయ్య మాట్లాడుతూ...మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మిషన్ భగీరథ మిషన్ కాకతీయ వృద్ధులకు వృద్ధాప్య, వితంతువులకు పెంఛన్ పుట్టిన పసికూన మొదలు పండు ముసలి వరకు సంక్షేమ పథకాలు నిస్వార్ధంగా అందించార న్నారు.ఓటర్లకు ఏ కష్టం వచ్చినా బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మూడవత్ శంకరమ్మ బాబ్య నాయక్ వెన్నంటి ఉంటారని వార్డు లో అండర్ డ్రైనేజీ,సిసి రోడ్లు, వీధిలైట్లు సీసీ కెమెరాలు మొదలగు ఇతర ప్రజా సంక్షేమానికి పాటుపడుతారన్నారు. ఈ కార్యక్రమంలో 8 వ వార్డు బూతు అధ్యక్షుడు ధర్మానాయక్, మాజీ ఎస్టీ సెల్ అధ్యక్షులు సేవ్య నాయక్, రామస్వామి మేస్త్రి,భరత్, ఎల్లస్వామి, బాబు, నవీన్, రాజు, నాగరాజు,కంచె నిరంజన్,వెంకటేష్, నరసింహ, స్వామి నాయక్, కృష్ణ నాయక్, బాల్య నాయక్,శివాలీలా, లక్ష్మి, వార్డులో భారీ సంఖ్యలో మహిళలు, యువకులు పెద్దలు పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.....