అశ్వారావుపేట మున్సిపల్ ఎన్నికల్లో వద్దిరాజు రవిచంద్ర

మాజీ ఎమ్మెల్యే మెచ్చా తాటి ముమ్మర ప్రచారం

అశ్వారావుపేట మున్సిపల్ ఎన్నికల్లో వద్దిరాజు రవిచంద్ర

IMG-20260206-WA0332​అశ్వారావుపేట, లోకల్ గైడ్ : 

మున్సిపల్ ఎన్నికల యుద్ధంలో బిఆర్ఎస్ పార్టీ తన ప్రచారాన్ని పతాక స్థాయికి చేర్చింది. శుక్రవారం రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, స్థానిక నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, బిఆర్ఎస్ ఇంచార్జ్ మెచ్చా నాగేశ్వరరావు, తాటి వెంకటేశ్వర్లు, ఉప్పల వెంకటరమణ అశ్వారావుపేటలో సుడిగాలి పర్యటన చేశారు. మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థిని శ్రీమతి కాసాని నాగ శేష పద్మ గెలుపును కాంక్షిస్తూ.. వార్డు నెంబర్ 1, 3, 6, 8, 18లలో వారు ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. ​ప్రచారంలో భాగంగా నాయకులు వార్డుల్లోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ, అశ్వారావుపేట అభివృద్ధి కేవలం బిఆర్ఎస్‌తోనే సాధ్యమని స్పష్టం చేశారు. అభివృద్ధి పనుల కొనసాగింపు కోసం, స్థానిక సమస్యల పరిష్కారం కోసం కారు గుర్తుకు ఓటు వేసి కాసాని నాగ శేష పద్మను, బిఆర్ఎస్ వార్డు కౌన్సిలర్లను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ​ప్రజాక్షేత్రంలో అజేయ శక్తిగా ​మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు తనదైన శైలిలో కార్యకర్తలను ఉత్సాహపరుస్తూ ప్రచారంలో దూసుకుపోయారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండే నాయకత్వం కావాలా? లేక ఎన్నికల వేళ మాత్రమే కనిపించే వారు కావాలా? అని ఆలోచించాలి" అని పిలుపునిచ్చారు. 1, 3, 6, 8, 18 వార్డులలో ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి నేతలకు ఘనస్వాగతం పలకడం విశేషం. ​చైర్ పర్సన్ అభ్యర్థిని కాసాని నాగ శేష పద్మ మాట్లాడుతూ, అశ్వారావుపేటను ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని, మహిళల సంక్షేమానికి, మౌలిక వసతులకు ప్రాధాన్యత ఇస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో ప్రజా ప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొన్నారు. వార్డులన్నీ గులాబీ జెండాలతో రెపరెపలాడుతుండటంతో అశ్వారావుపేటలో బిఆర్ఎస్ విజయం తథ్యమని విశ్లేషకులు భావిస్తున్నారు.

Tags:

About The Author

Latest News