అశ్వారావుపేట, లోకల్ గైడ్ :
అశ్వారావుపేట మున్సిపల్ ఎన్నికల రణక్షేత్రంలో 6వ వార్డు రాజకీయం ఒక్కసారిగా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మారింది. బిఆర్ఎస్ అభ్యర్థిని చిక్కం మాధురి తనదైన శైలిలో ప్రచార పర్వాన్ని ఉరకలెత్తిస్తున్నారు. శుక్రవారం వార్డులోని ప్రతి గల్లీ, ప్రతి గడపను తడుతూ ఆమె చేపట్టిన విస్తృత ప్రచారం ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. మహిళలు స్వచ్ఛందంగా తరలివచ్చి హారతులు పడుతూ, నీరాజనాలు పలుకుతుండటంతో 6వ వార్డులో ‘గులాబీ’ జెండా రెపరెపలాడటం ఖాయమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రచారంలో భాగంగా చిక్కం మాధురి మాట్లాడుతూ దోచుకునే వారు, దాచుకునే వారు మన వార్డుకు అవసరమా? ప్రజల కష్టాల్లో తోడుండే సేవకురాలు కావాలో మీరే నిర్ణయించుకోండి అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు వార్డులో సంచలనం సృష్టిస్తున్నాయి. గెలిచిన తర్వాత కనుచూపు మేరలో కనిపించని నాయకులకు ఈ ఎన్నికలే చరమగీతం కావాలని ఆమె పిలుపునిచ్చారు. కేవలం హామీలకే పరిమితం కాకుండా, వార్డు సమగ్ర అభివృద్ధికి ఆమె ఒక స్పష్టమైన విజన్‌ను ప్రజల ముందుంచారు వార్డులో దశాబ్దాలుగా వేధిస్తున్న మురుగునీటి సమస్య డ్రైనేజీ, సీసీ రోడ్ల నిర్మాణాలను పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రతి వీధిలో హై-మాస్ట్ లైట్లు, సీసీ కెమెరాల ఏర్పాటుతో మహిళల భద్రతకు పెద్దపీట వేస్తానని స్పష్టం చేశారు. వార్డు పరిధిలో ఎప్పటికప్పుడు బ్లీచింగ్, ఫాగింగ్ చేయిస్తూ పారిశుధ్య లోపం లేకుండా చూస్తానని మాటిచ్చారు. గెలిచిన తర్వాత ఆఫీసుల చుట్టూ తిరిగే పని లేకుండా, వార్డులోనే నిరంతరం అందుబాటులో ఉండి సమస్యలను అక్కడికక్కడే పరిష్కరిస్తానని భరోసా ఇచ్చారు. సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించే దమ్మున్న నాయకురాలు చిక్కం మాధురి అని స్థానిక ప్రజలు చర్చించుకుంటున్నారు. యువత, మహిళల మద్దతు భారీగా ఉండటంతో 6వ వార్డులో చిక్కం మాధురి విజయం నల్లేరుపై నడకేనని అర్థమవుతోందని ప్రజలు చర్చించుకుంటున్నారు. వార్డు అభివృద్ధి ప్రధాన కర్తవ్యంగా, సేవయే పరమావధిగా ముందుకు సాగుతున్న చిక్కం మాధురి గెలుపుకు దగ్గర అవడంతో ఇప్పుడు అశ్వారావుపేటలో హాట్ టాపిక్‌గా మారింది.