కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్స్ రద్దు చేయాలి.
వ్యవసాయ రైతు వ్యతిరేక విధానాలు నశించాలి.
దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జయప్రదం.
నల్లగొండ జిల్లా ప్రతినిధి. ఫిబ్రవరి 12 .(లోకల్ గైడ్).
కేంద్ర ప్రభుత్వ ప్రజా కార్మిక రైతు వ్యతిరేక విధానాలకు నశించాలి నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలి ఉపాధి హామీ చట్టాన్ని పరిరక్షించాలని రైతాంగ సమస్యను పరిష్కరించాలని సిఐటియు తిప్పర్తి మండల కన్వీనర్ భీమగాని గణేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు . గురువారం తిప్పర్తిలో సిఐటియు ఆధ్వర్యంలో సమ్మె సందర్భంగా మార్కెట్ యార్డ్ నుండి సెంటర్ నుండి ఎమ్మార్వో ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించి ఎమ్మార్వో ఆఫీస్ ముందు ధర్నా చేయడం జరిగింది ఈ సందర్భంగా గణేష్ మాట్లాడుతూ కార్మికులు పోరాడి సాధించుకున్న 29 చట్టాలను రద్దుచేసి తెచ్చిన నాలుగు లేబర్ కోడ్ లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల ను కారు చౌకగా కార్పొరేట్ శక్తులకు అమ్ముతూ దేశ సార్వభౌమత్వాన్ని తాకట్టు పెడుతున్నారని ఆరోపించారు. కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయాలని ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాలని ఉపాధి హామీ చట్టాన్ని కాపాడాలని విభజీ రాంజీ పథకాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు వ్యతిరేకంగా తెచ్చిన విత్తన విద్యుత్ సవరణ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గ్రామపంచాయతీ వర్కర్స్, వివోఏ, ఆశ వర్కర్స్, మధ్యాహ్నం భోజనం, భవన నిర్మాణ,హమలి కార్మికుల సమస్యలను పరిష్కరించాలని వారికి కనీస వేతనం 26000 నిర్ణయించాలని ఆశలకు ఫిక్స్డ్ వేతనం నిర్ణయించి వేతనాలు ఇవ్వాలని సెర్ఫ్ ద్వారా కనీస వేతనం నిర్ణయించి ఇవ్వాలని అన్నారు, గ్రామపంచాయతీ కార్మికులకు మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని, మధ్యాహ్నం భోజనం కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, హమాలీలకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, భావన నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డు పరిరక్షించాలని, పెండింగ్లో ఉన్న క్లెయిమ్స్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు, కార్మికులపై అధికారుల వేధింపులను అరికట్టాలని, పిఎఫ్, ఈఎస్ఐ ప్రమాద బీమా సౌకర్యం ప్రతి కార్మికులకు కల్పించాలని కార్మిక హక్కుల రక్షణ కోసం ప్రతి ఒక్క కార్మికులు పోరాటంలో పాల్గొనాలని పోరాటం ద్వారానే హక్కులు సాధించుకోవడం జరుగుతుందని అన్నారు. ఈ సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మన్నెం బిక్షం గండమల్ల రాములు డివైఎఫ్ఐ మండల కార్యదర్శి పోకల శశిధర్ సిఐటియు జిల్లా నాయకురాలు మంత్రాల మంగమ్మ యూనియన్ నాయకులు కంచర్ల జానయ్య, పాలడుగు చంద్రయ్య, యం.డి.రూమణ, జక్కల అనిత, టి. పార్వతమ్మ,దాసరి నిర్మల,పోలగోని యాదమ్మ, కిన్నెర సైదమ్మ, జిల్లాల సుధాకర్ రెడ్డి, శ్రీను, గోనే శ్యాంసుందర్, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.
