ఇంటి పన్ను మాత్రం నిరుపేదలకు...ఇంద్రమ్మ ఇండ్లు మాత్రం దొరలకా...?ఎటు పోతుంది కాంగ్రెస్  ప్రజాపాలన..?

బిజెపి మండల కార్యదర్శి శివ

ఇంటి పన్ను మాత్రం నిరుపేదలకు...ఇంద్రమ్మ ఇండ్లు మాత్రం దొరలకా...?ఎటు పోతుంది కాంగ్రెస్  ప్రజాపాలన..?

నారాయణపేట ఫిబ్రవరి 25:

ఇంటి బిల్లు మాత్రం నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు మాత్రం దొరలకు ఇందిరమ్మ ప్రజాపాలన ఎటు పోతోందని నారాయణపేట మండల బిజెపి కార్యదర్శి శివ కుమార్ ఒక ప్రకటనలో ప్రశ్నించారు. ఇల్లు లేదు భూమి లేదు  కనీసం టూ వీలర్ బైక్ కూడా లేదు భర్త చనిపోయినాడు  పొట్టకూటికై  ఇద్దరు పిల్లల్ని తీసుకొని హైదరాబాద్లో బతుకుతున్న వంటి ఆనంద మ్మ  ఇల్లు కూలి  10   సంవ త్సరాలు అవుతుందన్నారు. రేకులు వేసుకొని బ్రతుకు తుందనీ తెలిపారు.  కానీ ప్రజా పాలనలో దరఖాస్తు చేయగా ఇందిరమ్మ ఇల్లులో లబ్ధి పొందలేదన్నారు.  జలాల్పూర్ గ్రామంలో 30 ఇండ్లు మంజూరు అయినా కూడా అందులో కేవలం కాంగ్రె స్  కార్యకర్తలకు మాత్రమే మంజూరు చేయడం జరిగిందన్నారు.  భూమి ఉన్న వాళ్లకు ఫోర్ వీల్ ఉన్నవాళ్లకు అని చట్టం పెట్టినా కూడా అన్ని ఉన్నవాళ్లకు మాత్రమే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడం జరిగిందనీ తెలి పారు. ఏమీ లేని నిరుపేదలు ఎంతోమంది ఉన్నా కూడా వారికి ఇల్లు మంజూరు లేదనీ వితంతు పింఛను తీసుకోవ డానికి వెళ్తే  ఇంటి పన్ను కట్ చేసుకొని మిగతావి ఇవ్వడం జరిగిందనీ ఆవేదన వ్యక్తం చేశారు.ఇదేనా ప్రజాపాలన అని  ఇది ఎంతవరకు న్యాయం అని ప్రశ్నించారు. పేదలకు ఇల్లు ఇవ్వకపోతే బిజెపి ఆందోళన చేపడుతుం దని హెచ్చరించారు.
ఫోటో రైట్ అప్: ఇంటి పన్ను చెల్లించాలని ఇల్లు కూలిన మహిళ కు నోటీసు
_____________________

Tags:

About The Author

Latest News

టీడబ్ల్యూజేఎఫ్ ఏ రాజకీయ పార్టీకి అనుబంధం కాదు టీడబ్ల్యూజేఎఫ్ ఏ రాజకీయ పార్టీకి అనుబంధం కాదు
హైదరాబాద్, (లోకల్ గైడ్ ప్రతినిధి కృష్ణ): తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టిడబ్ల్యూజేఎఫ్) ఏ రాజకీయ పార్టీకి లేదా ఏ మీడియా సంస్థకు అనుబంధం కాదని ఆ...
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అరెస్ట్
కాంగ్రెస్ పార్టీ లోకీ ఎమ్మెల్యే రాందాస్ నాయక్ సమక్షంలో భారీ చేరికలు 
తెలంగాణ ఉద్యమంలో ‘దరువు’ పాత్ర అభినందనీయం
వేములపల్లి మండలంలోని శెట్టిపాలెం గ్రామంలో.
భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో మండల సమితి సమావేశం.
మియాపూర్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు