బిఆర్ఎస్ కట్టు కథలు అల్లడం మానుకోవాలి.
బిఆర్ఎస్ లో చేరిన వారికి ఎన్ఎస్ యుఐ తో సంబంధం లేదు. దమ్ముంటే ఆధారాలు చూపండి.
By Ram Reddy
On
ఎన్ఎస్ యుఐ నియోజకవర్గ నాయకులు ప్రేమ్ కుమార్.
లోకల్ గైడ్/తాండూర్:
బిఆర్ఎస్ నాయకులు కట్టు కథలు అల్లడం మానుకోవాలని తాండూర్ నియోజకవర్గ ఎన్ఎస్ యుఐ నాయకులు ప్రేమ్ కుమార్ హెచ్చరించారు. సోమవారం తాండూరు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సమక్షంలో ఎన్ఎస్ యుఐ నాయకులమంటూ బిఆర్ఎస్ పార్టీలో చేరిన మాట అవాస్తవం. పార్టీలో చేరిన వారికీ ఎన్ ఎస్ యుఐతో ఎలాంటి సంబంధం లేదు. కాంగ్రెస్ పట్ల పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేకనే బిఆర్ఎస్ ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తుందని వ్యాఖ్యానించారు.ఒకవేళ వారు ఎన్ఎస్ యుఐ నాయకులమని అనుకుంటే ఆధారాలు చూపాలని సవాల్ విసిరారు. రాజకీయ ఉనికి కోసం ఎన్ఎస్ యుఐ సంఘం గురించి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు.
Tags:
About The Author
Related Posts
Latest News
23 Feb 2026 19:02:05
సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కలవేన శంకర్.
