జిల్లాలో గ్యాస్ సిలిండర్ ల కొరత లేదు..ప్రజలు  గ్యాస్ కొరత పుకార్లను నమ్మవద్దు:

జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్.

జిల్లాలో గ్యాస్ సిలిండర్ ల కొరత లేదు..ప్రజలు  గ్యాస్ కొరత పుకార్లను నమ్మవద్దు:

నిర్మల్ : లోకల్ గైడ్ :
    జిల్లాలో డొమెస్టిక్, కమర్షియల్ గ్యాస్ సిలిండర్లకు ఎటువంటి కొరత లేదని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ స్పష్టం చేశారు. అన్ని గ్యాస్ ఏజెన్సీలలో తగినంత గ్యాస్ అందుబాటులో ఉందని తెలిపారు. గ్యాస్ సిలిండర్లను బుక్ చేసుకున్నవారికి నిర్ణీత సమయంలోపల సిలిండర్లను ప్రజలకు డోర్ డెలివరీ చేస్తున్నట్లు వివరించారు. ప్రజలకు ఎవరికైనా గ్యాస్ సిలిండర్ల సరఫరాలో ఇబ్బందులు కలిగితే కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నెంబరు 91005 77132 ను సంప్రదించవచ్చునని వివరించారు. ఇప్పటికే గ్యాస్ సిలిండర్ల ఏజెన్సీ లతో సమావేశం నిర్వహించి, ప్రజలకు సరిపడినన్ని సిలిండర్లను సాఫీగా పంపిణీ చేసే విధంగా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామని పేర్కొన్నారు. ప్రజలు ఎవరు గ్యాస్ కొరత అని వస్తున్న అసత్య వార్తలను, పుకార్లను నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు.

Tags:

About The Author

Latest News

ఎంతరాత్రి వరకైనా సరే ఆస్తి పన్ను వసూలు చేయాల్సిందే - షాద్ నగర్ మున్సిపాల్ కమిషనర్ అధికారులకు హుకుంజారీ. ఎంతరాత్రి వరకైనా సరే ఆస్తి పన్ను వసూలు చేయాల్సిందే - షాద్ నగర్ మున్సిపాల్ కమిషనర్ అధికారులకు హుకుంజారీ.
  ఆస్థి పన్ను వసూల్ కోసం ఇళ్లకు వెళ్లిన అధికారులకు సవా లక్షా ప్రశ్నలతో ముచ్చెమటలు పట్టిస్తున్న ఆస్తిపన్నుదారులు. కాలనీలో ఏం అభివృద్ధి చేశారని ఆస్తిపన్ను వసూలుకు
గాలి గూడెంలో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశo
కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి.
బిజ్వార్ లో సీసీ రోడ్డు పనులు ప్రారంభం 
ఛత్రపతి శివాజీ,అంబేద్కర్ విగ్రహావిష్కరణ భూమి పూజలో
హైదరాబాద్‌లో ఘనంగా ‘యువ భారత్ రన్ 2026’ నిర్వహణ – యువతలో ఫిట్‌నెస్, విలువలకు నూతన దిశ
శాసనసభలో ఆర్‌&బీ శాఖపై మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ప్రసంగం