విజయలక్ష్మి హాస్పిటల్ తనిఖీ. షోకాస్ నోటీసులు జారీ.
జిల్లా వైద్య శాఖ అధికారి డాక్టర్ రవి రాథోడ్
తొర్రూర్(లోకల్ గైడ్ )
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలోని విజయ లక్ష్మి హాస్పిటల్‌ను (డాక్టర్ పి కిరణ్ కుమార్) జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ రవి రాథోడ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇటీవల ఆసుపత్రిసంబంధితవైద్యుడిపైవచ్చినఆరోపణలనేపథ్యంలో విచారణ నిమిత్తంఈతనిఖీచేపట్టారు.అయితే, తనిఖీకి వెళ్లిన సమయంలో ఆసుపత్రి మూసివేసి ఉండడం గమనార్హం. ఈ సందర్భంగా అక్కడ సంబంధిత సిబ్బందికి షోకాజ్ నోటీసులు అందించినట్లుజిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారితెలిపారు.ఆయనమాట్లాడుతూ, ఆసుపత్రుల నిర్వహణలో నిర్లక్ష్యం, నియమ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం అస్సలు సహించబడదని స్పష్టం చేశారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాల్సిన బాధ్యత ప్రతి ఆసుపత్రి యాజమాన్యం మరియు సిబ్బందిపై ఉందని తెలిపారు.ఈ సంఘటనపై పూర్తిస్థాయి నివేదికను సిద్ధం చేసి, తదుపరి చర్యలు తీసుకోబడతాయని ఒక ప్రకటనలో తెలిపారు.
