4వ వార్డ్ కౌన్సిలర్‌గా గొల్ల శ్రీశైలం యాదవ్‌ను గెలిపించాలని

ప్రచారంలో పాల్గొన్న రాష్ట్ర బీసీ ఐక్యవేదిక అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్.

4వ వార్డ్ కౌన్సిలర్‌గా గొల్ల శ్రీశైలం యాదవ్‌ను గెలిపించాలని

పఠాన్ చేరు, (లోకల్ గైడ్ ప్రతినిధి కృష్ణ):

పఠాన్ చేరు మండలం చిట్కుల్ పరిధిలోని ఇస్నాపూర్ మున్సిపాలిటీ 4వ వార్డ్ కౌన్సిలర్‌గా పోటీ చేస్తున్న మాజీ మండల అధ్యక్షులు గొల్ల శ్రీశైలం యాదవ్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతూ ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ ప్రచార కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్యవేదిక అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్ పాల్గొని, ఇంటింటి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..బీసీ వర్గాల అభివృద్ధి కోసం కృషి చేసే నాయకులను తప్పనిసరిగా గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని, అందులో భాగంగానే శ్రీశైలం యాదవ్‌కు ఓటు వేసి గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ బీసీ నాయకులు, రాష్ట్ర ఉపాధ్యక్షులు పాములేటి యాదవ్, బీసీ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఆర్.కే.సాయన్న ముదిరాజ్, బీసీ ఐక్యవేదిక ఆర్గనైజింగ్ సెక్రటరీ హరికృష్ణ చారి, కార్యదర్శి మారుతి ముదిరాజ్‌తో పాటు ఇతర బీసీ నాయకులు పాల్గొన్నారు. చిట్కుల్ 4వ వార్డ్‌తో పాటు 8వ వార్డ్, పరిసర ప్రాంతాలలో మహిళలు, యువత, పెద్ద సంఖ్యలో కార్యకర్తలతో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు ప్రజలను కలిసి, కుటుంబ సభ్యులతో మాట్లాడి, తప్పనిసరిగా ఓటు వేసి శ్రీశైలం యాదవ్‌ను గెలిపించాలని కోరారు. శ్రీశైలం యాదవ్ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ప్రచార కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Tags:

About The Author

Latest News

4వ వార్డ్ కౌన్సిలర్‌గా గొల్ల శ్రీశైలం యాదవ్‌ను గెలిపించాలని 4వ వార్డ్ కౌన్సిలర్‌గా గొల్ల శ్రీశైలం యాదవ్‌ను గెలిపించాలని
పఠాన్ చేరు, (లోకల్ గైడ్ ప్రతినిధి కృష్ణ): పఠాన్ చేరు మండలం చిట్కుల్ పరిధిలోని ఇస్నాపూర్ మున్సిపాలిటీ 4వ వార్డ్ కౌన్సిలర్‌గా పోటీ చేస్తున్న మాజీ మండల...
ప్రగతి వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో బాల స్వాస్థ్య శిబిరం విజయవంతం.
గెలిపించే బాధ్యత మీది... అభివృద్ధి  బాధ్యత నాది
పదేళ్లలో అప్పుల రాష్ట్రాన్ని మార్చిన కేసిఆర్. అప్పులు తీర్చలేక తిప్పలు పడుతున్నం
పుర జోరులో సింగరేణి సర్పంచుల హోరు.
వైరా పురా జోర్లో కారేపల్లి నాయకుల హావ.
ప్రజల సహకారంతో గెలుస్తునాం కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి  సాధ్యం.