లోకల్ గైడ్ తెలంగాణ తెలుగు దినపత్రిక నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించిన మాజీ మంత్రి డాక్టర్ సి. లక్ష్మారెడ్డి.
ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తున్న దినపత్రికలో లోకల్ గైడ్ తెలంగాణ తెలుగు దినపత్రిక జనాదరణ పొందిన దినపత్రిక
జడ్చర్ల కేంద్రంము లోని శ్రీశ్రీశ్రీ సత్యనారాయణ స్వామి ఆలయంలో లోకల్ గైడ్ తెలంగాణ జర్నలిస్ట్ ఎస్. మోహన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన, లోకల్ గైడ్ తెలంగాణ దినపత్రిక నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించిన మాజీ మంత్రి డాక్టర్ సి. లక్షారెడ్డి.
ఈ సందర్భంగా మాజీ మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ,ప్రజల పక్షాన అన్ని విధాల వారధిగా అన్ని దినపత్రికలు పనిచేయాలని సూచించారు.అదేవిధంగా ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తున్న దినపత్రికలో లోకల్ గైడ్ తెలంగాణ తెలుగు దినపత్రిక జనాదరణ పొందిన దినపత్రిక అని కొనియాడారు.మరియు నిజాన్ని నిర్భయంగా రాస్తూ ప్రజల హృదయాల్లో ఒక స్థానాన్ని నిర్ధారించిన ఏకైక దినపత్రిక లోకల్ గైడ్ తెలంగాణ తెలుగు దినపత్రిక అని అన్నారు.ఇక ముందు కూడా ప్రజల కోసం పనిచేస్తూ ముందుకు సాగాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు,పత్రికా విలేఖరులు తది తరులు పాల్గొన్నారు.
