మున్సిపోల్ నామినేషన్ల ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు పూర్తి - కలెక్టర్ పట్నాయక్
జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు.
By Ram Reddy
On
నారాయణపేట లోకల్ గైడ్
కాగా నారాయణపేట కలెక్టరేట్ లోని వీసీ హాల్ నుంచి జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ కుమార్ తో కలిసి జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ వీసీ లో పాల్గొన్నారు. వీసీ అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల ఎన్నికలకు షెడ్యూల్డ్ విడుదల అయిందని, ఈ నెల 28 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం అవుతుం దని, నామినేషన్ల ప్రక్రియ మొదలుకుని, నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ, తుది జాబితా, గుర్తుల కేటాయింపు, పోలింగ్ కేంద్రాలలో పోలింగ్ నిర్వహణ కు ఏర్పాట్లు, స్ట్రాంగ్ రూమ్, ప్రశాంత వాతావరణంలో పోలింగ్ నిర్వహణ, కౌంటింగ్ ప్రక్రియ వరకు ఎక్కడా ఎలాంటి చిన్న పొరపాట్లకు అవకాశం ఇవ్వకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆయా మున్సిపల్ కమిషనర్ లను కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎస్ డీ సీ రాజేందర్ గౌడ్, డీఎస్పీ నల్లపు లింగయ్య, ఆర్డీవో రామచందర్ నాయక్, నోడల్ అధికారులు సాయిబాబా, జాన్ సుధాకర్, అబ్దుల్ ఖలీల్, రహమాన్, మున్సిపల్ కమిషనర్లు గోల్కొండ నర్సయ్య, శ్రీ రాములు, నాగరాజ్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
Tags:
About The Author
Latest News
09 Feb 2026 20:59:17
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సహకారంతో భారీగా నిధులతో అభివృద్ధి 21వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి రమ్య జ్యోతి శ్రీకాంత్ ను గెలిపించండి.
