మార్చి 28న జాతీయ లోక్ అదాలత్ – కేసుల పరిష్కారానికి మంచి అవకాశం.

చిన్న చిన్న కేసులను సులభంగా పరిష్కరించుకునే అవకాశం

మార్చి 28న జాతీయ లోక్ అదాలత్ – కేసుల పరిష్కారానికి మంచి అవకాశం.

సిద్దిపేట జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్ తెలంగాణ) 

మార్చి 28న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ ద్వారా చిన్న చిన్న కేసులను సులభంగా పరిష్కరించుకునే అవకాశం ఉందని సిద్ధిపేట పోలీస్ కమిషనర్ ఎస్. రష్మీ పెరుమాళ్ తెలిపారు.కంపౌండబుల్ కేసులు, సివిల్ వివాదాలు, ఆస్తి విభజన, కుటుంబ సంబంధిత కేసులు, రోడ్డు ప్రమాదాలు, డ్రంక్ అండ్ డ్రైవ్, టౌన్ న్యూసెన్స్, చెక్ బౌన్స్ వంటి కేసులను పరస్పర రాజీ ద్వారా త్వరితగతిన పరిష్కరించుకోవచ్చని చెప్పారు. సంబంధిత పోలీస్ స్టేషన్ లేదా న్యాయస్థానాన్ని సంప్రదించి ఇరువర్గాలు ముందుకు వస్తే లోక్ అదాలత్ ద్వారా సమస్యలను పరిష్కరించుకోవచ్చని సూచించారు.చిన్న చిన్న కేసుల కోసం కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయం, డబ్బు వృథా చేసుకోవద్దని, న్యాయ విభాగం అందిస్తున్న ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పోలీస్ అధికారులు ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో రాజీ పడదగిన కేసులను గుర్తించి, ఇరువర్గాలకు కౌన్సిలింగ్ నిర్వహించి అవగాహన కల్పిస్తున్నారని తెలిపారు.
లోక్ అదాలత్ ద్వారా బాధితులకు వేగంగా న్యాయం లభిస్తుందని పోలీస్ కమిషనర్ పేర్కొన్నారు.

Tags:

About The Author

Latest News

విద్యార్థుల భవిష్యత్తుకై ‘విద్యాసేవ’ – టేబుల్, కుర్చీల విరాళం విద్యార్థుల భవిష్యత్తుకై ‘విద్యాసేవ’ – టేబుల్, కుర్చీల విరాళం
    వెంకటాపురం : లోకల్ గైడ్ :ములుగు జిల్లా వెంకటాపురం మండల పరిధిలోని యాకన్నగూడెం గ్రామపంచాయతీ ఎంపీపీఎస్ పాఠశాల విద్యార్థుల కోసం ఎలకల రామారావు ఆధ్వర్యంలో టేబుల్,
ఆరోగ్య వారోత్సవాలను విజయవంతంగా నిర్వహించాలి.
ఓటరు జాబితా సవరణలో రాజకీయ పార్టీల సహకారం తప్పనిసరి
రాష్ట్ర ఇంధన శాఖ ప్రత్యేక కార్యదర్శి నవీన్ మిట్టల్ ను
కారేపల్లి రైల్వే భూసేకరణపై కలెక్టరేట్ లో సమావేశం 
భూ సేకరణ ప్రక్రియ ను త్వరగా పూర్తి చేయాలి.
ఆళ్లపల్లిలో జిల్లా కలెక్టర్ అంకిత్ పర్యటన