తేగడ గ్రామ యువతకు వాలీబాల్ కిట్ అందజేత.

క్రీడల ప్రాధాన్యంపై ఉపాధ్యాయుడు మీడియం రామకృష్ణ సందేశం

తేగడ గ్రామ యువతకు వాలీబాల్ కిట్ అందజేత.

భద్రాద్రి జిల్లా, చర్ల : లోకల్ గైడ్ :
చర్ల మండల పరిధిలో ఉన్న తేగడ గ్రామ యువతలో క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందించేందుకు ఉపాధ్యాయుడు మీడియం రామకృష్ణ వాలీబాల్ కిట్‌ను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి క్రీడల్లో రాణించాలని సూచించారు.
క్రీడలు కేవలం శారీరక దృఢత్వాన్ని మాత్రమే కాకుండా క్రమశిక్షణ, ఐక్యత, పోటీ భావనలను పెంపొందిస్తాయని ఆయన తెలిపారు. క్రీడల ద్వారా యువత ఆరోగ్యంగా ఉండటంతో పాటు జీవితంలో విజయాలను సాధించే లక్షణాలు అలవడతాయని అన్నారు. గ్రామ యువత క్రీడల పట్ల ఆసక్తి చూపి జిల్లా, రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబరచాలని ఆకాంక్షించారు. గ్రామంలో క్రీడా స్ఫూర్తి పెంపొందించేందుకు అందరూ కలిసి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ యువకులు, పలువురు స్థానికులు పాల్గొన్నారు. వాలీబాల్ కిట్ అందజేసిన ఉపాధ్యాయుడు మీడియం రామకృష్ణకు యువత కృతజ్ఞతలు తెలిపారు.

Tags:

About The Author

Latest News

తుర్మామిడి గ్రామంలో రంజాన్ తోఫాల పంపిణీ. తుర్మామిడి గ్రామంలో రంజాన్ తోఫాల పంపిణీ.
లోకల్ గైడ్/బంట్వారం: పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా బంట్వారం మండల పరిధిలోని తుర్మామిడి గ్రామంలో బుధవారం ముస్లిం మహిళలకు రంజాన్ తోఫాల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు....
నర్మెట్టలో రైతు ఉత్సవాలకు ఘన ప్రారంభం
_శ్రీ పరాభవనామ సంవత్సరం ఉగాది కవి పద్య సమ్మేళనం ఘనంగా
అంబేద్కర్ యువజన సంఘం నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక.
నూతన తెలుగు సంవత్సరము ను పురస్కరించుకుని
సర్వారం గ్రామంలో బస్సు రోజు వీర బ్రహ్మచారి గుండెపోటుతో మృతి. 
రేపే రైతు మేళా ప్రారంభం – ఏర్పాట్లలో అధికారుల బిజీ