ఆయిల్ ఫామ్ సాగుతో రైతులకు అధిక లాభాలు: కలెక్టర్ హైమావతి

గురువారం దుబ్బాక మండలం దుంపలపల్లి గ్రామంలో నిర్వహించిన

ఆయిల్ ఫామ్ సాగుతో రైతులకు అధిక లాభాలు: కలెక్టర్ హైమావతి

సిద్ధిపేట జిల్లా బ్యూరో (లోకల్ గైడ్ తెలంగాణ)

మార్చి 5:జిల్లాలో ఆయిల్ ఫామ్ సాగు అత్యంత లాభదాయకమని, రైతులు పంట మార్పిడి చేపట్టి ఆయిల్ ఫామ్ సాగుకు ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ కె. హైమావతి రైతులకు సూచించారు. గురువారం దుబ్బాక మండలం దుంపలపల్లి గ్రామంలో నిర్వహించిన ఆయిల్ ఫామ్IMG-20260305-WA0098 మెగా ప్లాంటేషన్ డ్రైవ్‌లో భాగంగా రైతు చింతరాజు వ్యవసాయ క్షేత్రంలో 12 ఎకరాల విస్తీర్ణంలో కలెక్టర్ ఆయిల్ ఫామ్ మొక్కను నాటారు. జిల్లాలో ఇప్పటివరకు 14,200 ఎకరాల్లో ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్ జరిగిందని తెలిపారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎక్కువ మంది రైతులు వరి సాగుపైనే ఆధారపడుతున్నారని, పంట మార్పిడితో కూరగాయలు, తోటల పెంపకం, పండ్ల తోటలు, ఆయిల్ ఫామ్ సాగు చేయాలని సూచించారు. ప్రభుత్వం ఆయిల్ ఫామ్ సాగును ప్రోత్సహిస్తూ ఎకరాకు రూ.50 వేల వరకు మొక్కలు, డ్రిప్, నిర్వహణ ఖర్చుల కోసం సబ్సిడీ అందజేస్తుందని తెలిపారు. మూడు సంవత్సరాల పాటు సాగు నిర్వహిస్తే నాలుగో సంవత్సరం నుంచి రైతులకు ఆదాయం ప్రారంభమవుతుందని చెప్పారు.
ఈ కాలంలో అంతర పంటలుగా అరటి, కోకో వంటి పంటలు సాగు చేసి అదనపు ఆదాయం పొందవచ్చని తెలిపారు. ఆయిల్ ఫామ్ సాగు ద్వారా రైతులు ప్రభుత్వ ఉద్యోగుల వేతనానికి సమానంగా నెలవారీ ఆదాయం పొందే అవకాశం ఉందన్నారు. ఆయిల్ ఫామ్ సాగు చేస్తున్న రైతులు తమ అనుభవాలను ఇతర రైతులకు తెలియజేసి ప్రోత్సహించాలని, జిల్లాలో పంట మార్పిడిని విస్తృతంగా చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యానవన శాఖ అధికారి సువర్ణ, తహసీల్దార్ సంజీవ్, ఇతర అధికారులు, రైతులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

హుస్నాబాద్‌లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం హుస్నాబాద్‌లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం
సిద్దిపేట జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్ తెలంగాణ)  మార్చి17:మొక్కజొన్న రైతుల సౌకర్యార్థం హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించినట్లు రాష్ట్ర రవాణా మరియు...
మే 11వ తేదీ నుండి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా జనగణన  మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ కుష్బూ గుప్త ప్రకటన 
సహజ వ్యవసాయం వైపు రైతులు ముందుకు రావాలి
డ్రగ్స్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహణ.
వార్డ్ మెంబర్లకు రెండో విడత శిక్షణ విజయవంతం
గుండాల మండలంలో కలెక్టర్ అంకిత్ ఆకస్మిక తనిఖీలు – సేవల నాణ్యతపై కఠిన సమీక్ష
విజయలక్ష్మి హాస్పిటల్ తనిఖీ. షోకాస్ నోటీసులు జారీ.