అపార్ట్మెంట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య.

అసోసియేషన్‌ల సేవలు అభినందనీయమని పేర్కొన్నారు.

అపార్ట్మెంట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య.

హనుమకొండ  లోకల్ గైడ్ న్యూస్

హంటర్ రోడ్ లోని ఆకృతి అపార్ట్ మెంట్స్ లో ఏర్పాటు చేసిన అపార్ట్మెంట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ డైరీ ఆవిష్కరణ కార్యక్రమానికి వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య ముఖ్య అతిధిగా హాజరై 2026 నూతన డైరీని ఆవిష్కరించారు.
*ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వరంగల్ ఎంపీ డా.కడియం కావ్య మాట్లాడుతూ*, అపార్ట్మెంట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్‌లు సమాజంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని అన్నారు. నివాస ప్రాంతాల్లో పరిశుభ్రత, భద్రత, పరస్పర సహకారం పెంపొందించడంలో అసోసియేషన్‌ల సేవలు అభినందనీయమని పేర్కొన్నారు. అపార్ట్మెంట్లలో నివసిస్తే మంచి సౌకర్యాలు లభిస్తాయనే భావన ప్రజల్లో బలంగా నెలకొనాలని అన్నారు. అపార్ట్మెంట్ అంతా ఒక కుటుంబ సభ్యుల్లా కలిసి జీవిస్తూ సాంస్కృతిక సంప్రదాయాలను కొనసాగిస్తూ పండుగలు జరుపుకోవడం అభినందనీయమని పేర్కొన్నారు. గతంలో పక్కన నివసించే వారెవరో కూడా తెలియని పరిస్థితి ఉండేదని, అయితే ఇప్పుడు అపార్ట్మెంట్ సంస్కృతి పూర్తిగా మారి అందరూ ఒక కుటుంబంలా కలిసి ప్రతి పండుగను వైభవంగా జరుపుకుంటున్నారని తెలిపారు. ఫిజికల్ హెల్త్‌తో పాటు మెంటల్ హెల్త్‌పై కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలని, ఆరోగ్యమే నిజమైన సంపదని చెప్పారు. అపార్ట్మెంట్ వాసులు ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఐక్యతతో ముందుకు సాగాలని సూచించారు. అపార్ట్మెంట్లకు సంబంధించిన ప్రధాన సమస్యల పరిష్కారానికి తాను ముందుండి కృషి చేస్తానని, ముఖ్యంగా వాటర్ లైన్ వంటి మౌలిక వసతుల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానని ఎంపీ డా.కడియం కావ్య హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో అపార్ట్ మెంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు కేశవరెడ్డి, జనరల్ సెక్రటరీ ప్రభాకర్, వర్కింగ్ ప్రెసిడెంట్ విజయ్ కుమార్, ట్రెజరర్ రాజ్ కుమార్, అపార్ట్మెంట్ సభ్యులు,  ఇతర కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

తమ్ముడు అంటే ఇలా ఉండాలి. తమ్ముడు అంటే ఇలా ఉండాలి.
లోకల్ గైడ్ : షాద్‌నగర్ అన్నపై ఉన్న ప్రేమకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచాడు గుర్రపల్లి భాను యాదవ్. తన అన్న లల్లు యాదవ్ పుట్టినరోజు సందర్భంగా భాను...
టీజేఎంయూ ఖమ్మం జిల్లా అధ్యక్షులుగా ఎండీ ఫస్సిద్దిన్ ఏకగ్రీవ ఎంపిక 
షాద్ నగర్ పట్టణాభివృద్ధికి కాంగ్రెస్ కు ఓటు వేయండి.
కాంగ్రెస్ పార్టీ మాత్రమే అభివృద్ధిని అందించగలదు.
అభివృద్ధి, ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం-కాంగ్రెస్ పార్టీ జిల్లేడు చౌదరి గూడెం మండల అధ్యక్షులు చలివేంద్రం పల్లి రాజు. 
మరో గంటలో కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల.
మంత్రి పొంగులేటి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన గణపారపు వీరయ్య