పూలే–అంబేడ్కర్ జయంతుల సందర్భంగా కుల రహిత

 సమానత్వ సాంస్కృతిక ఉత్సవాలు జయప్రదం చేయండి

పూలే–అంబేడ్కర్ జయంతుల సందర్భంగా కుల రహిత

జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున.

 నల్లగొండ ఉమ్మడి జిల్లా  .మార్చి 22. (లోకల్ గైడ్)

మహాత్మ జ్యోతిబా పూలే, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతుల సందర్భంగా కులరహిత సమానత్వ సాంస్కృతిక ఉత్సవాలను విజయవంతం చేయాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున పిలుపునిచ్చారు. ఈనెల 28 న నల్లగొండలో  ఆహ్వాన సంఘాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా మిర్యాలగూడ పట్టణంలోని కందుకూరి కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.మహనీయుల ఆశయాలను కొనసాగించడానికి భావితరాలకు సామాజిక వివక్ష, అన్యాయాలు, దళితుల సంక్షేమం , అభివృద్ధి అంశాలపై సమగ్ర చర్చలు జరగాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.నేటికీ కుల వివక్ష తీవ్రమైన రూపం దాలుస్తోందని, కులం–మతం పేరుతో సమాజంలో విభజనలు సృష్టించే కుట్రలు కొనసాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దళితులపై దాడులు, కులదురహంకార హత్యలు, కులాంతర వివాహాలపై దాడులు పెరుగుతున్నాయని అన్నారు. సమాన అవకాశాలు దళితులకు అందకుండా అడ్డంకులు సృష్టించే పరిస్థితులు బహిరంగంగా కనిపిస్తున్నాయని తెలిపారు.ఈ నేపథ్యంలో పూలే–అంబేడ్కర్ జనజాతర ద్వారా కులరహిత సమానత్వం కోసం సామాజిక సాంస్కృతిక ఉత్సవాలు నిర్వహిస్తున్నామని, ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు సామాజిక సంఘాలు ప్రజా సంఘాలు ప్రజలు, ప్రజాతంత్ర వాదులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో సంఘం జిల్లా అధ్యక్షుడు కొండేటి శ్రీను, రాష్ట్ర కమిటీ సభ్యులు రెమిడాల పరిసరాములు, జిల్లా సహాయ కార్యదర్శి దైద శ్రీను, ఉపాధ్యక్షులు కోడిరెక్క మల్లయ్య, జిల్లా కమిటీ సభ్యులు దోరేపల్లి మల్లయ్య, యేసు,
 నల్ల రామస్వామి బొంగరల వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

నాటక రచయితకు, నిర్వాహకులకు సన్మానం. నాటక రచయితకు, నిర్వాహకులకు సన్మానం.
*       ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి ఏప్రిల్01లోకల్ గైడ్    వరంగల్ రామన్నపేట లోని డాక్టర్.ఏ. రాజేంద్రప్రసాద్ భారతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పోతన ఆడిటోరియంలో ప్రదర్శించబడిన పూరి...
సకల మానవాళికి ప్రమాదం యుద్ధం
జిల్లా వ్యాప్తంగా 30పోలీస్ యాక్ట్ అమలు.....
ప్రజాప్రతినిధుల ఆశీస్సులతో ఘనంగా వివాహ వేడుక
46వ డివిజన్‌లో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన
ప్రజల మధ్యే సంక్షేమం…  నేరుగా లబ్ధిదారుల చేతికి కోట్ల చెక్కులు..
కార్మిక లేబర్ కోడ్ ల అమలును నిరసిస్తూ కాటేదాన్ చౌరస్తా