అభివృద్ధిలో కాజీపేట రూపురేఖలు మారుస్తాం: ఎమ్మెల్యే నాయిని
By Ram Reddy
On
ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి ఏప్రిల్01(లోకల్ గైడ్
వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని కాజీపేట ప్రాంతాన్ని అభివృద్ధిలో ముందంజలో నిలపాలని సంకల్పంతో ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటోందని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తెలిపారు. గత పాలనలో కాజీపేట తీవ్ర నిర్లక్ష్యానికి గురైందని, ఇప్పుడు ప్రజా ప్రభుత్వంలో అభివృద్ధి కొత్త దిశగా సాగుతోందని ఎమ్మెల్యే నాయిని స్పష్టం చేశారు.99 రోజుల ప్రణాళిక ప్రగతి పాలనలో భాగంగా,63వ డివిజన్ జూబ్లీ మార్కెట్ రోడ్డులో రూ.50 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, నగర మేయర్ గుండు సుధారాణి ముఖ్య అతిథులుగా హాజరై శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గతంలో రాజకీయ ప్రయోజనాల కోసం శిలాఫలకాలు మాత్రమే ఏర్పాటు చేసి పనులు వదిలేసిన ఉదాహరణలు ఉన్నాయని విమర్శించారు. అయితే ప్రస్తుతం అలాంటి పరిస్థితులకు ముగింపు పలికి, శంకుస్థాపన చేసిన పనులను వేగంగా పూర్తి చేసే దిశగా ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. అభివృద్ధి పనులకు భారీగా నిధులు కేటాయిస్తూ, కాజీపేట రూపురేఖలను పూర్తిగా మార్చే దిశగా ముందుకు సాగుతున్నామని తెలిపారు.కాజీపేటలో వైద్య రంగంలో కూడా నూతన ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టామని, ప్రజలు గత పాలనతో పోల్చి ప్రస్తుత ప్రభుత్వ పనితీరును అర్థం చేసుకోవాలని సూచించారు. కొంతమంది నాయకులు ఎన్నికల సమయంలో మాత్రమే కోచ్ ఫ్యాక్టరీ, రైల్వే డివిజన్, కాజీపేటబస్ స్టాండ్ వంటి అంశాలపై ఆందోళనలు చేస్తూ రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని విమర్శించారు. రాజకీయాలు,పార్టీలకు అతీతంగా అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నామని, ప్రజల మద్దతుతో కాజీపేటను ఆదర్శవంతమైన ప్రాంతంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో సంక్షేమం, అభివృద్ధి రంగాల్లో ప్రత్యేక దృష్టి సారించడం పట్ల ఆయన కృతజ్ఞతలు తెలిపారు.అలాగే నియోజకవర్గానికి 3,500 ఇళ్లను కేటాయించగా, ప్రస్తుతం ప్రతి డివిజన్‌లో ఇళ్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని, ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ వారి అభ్యున్నతికి నిరంతరం కృషి చేస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ సయ్యద్ విజయశ్రీ రజాలి, జక్కుల రవీందర్ యాదవ్, ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు, మహమ్మద్ అంకుస్, రహమత్, కాజీపేట తహసిల్దార్ రాజు నాయక్, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Tags:
About The Author
Latest News
05 Apr 2026 14:14:15
ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ చంద్ర ముఖర్జీ ఐపిజిడిసిడబ్ల్యు (ఏ) నాంపల్లి హాజరు
