శ్వేత పాండురంగా రెడ్డి గెలుపు కోసం కాంగ్రెస్ నాయకుల విస్తృత ప్రచారం.

విస్తృత ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

శ్వేత పాండురంగా రెడ్డి గెలుపు కోసం కాంగ్రెస్ నాయకుల విస్తృత ప్రచారం.

శంకర్ పల్లి, (లోకల్ గైడ్ ప్రతినిధి కృష్ణ):

శంకర్‌పల్లి మునిసిపాలిటీ పరిధిలోని వార్డు నెంబర్‌ 14లో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి శ్వేత పాండురంగా రెడ్డి గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ నాయకులు విస్తృత ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచార కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పర్స శ్యామ్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు నరేందర్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, నవారి భుజంగ రెడ్డి, రెడ్డి రాంచందర్ రెడ్డి తదితరులు పాల్గొని వార్డు పరిధిలో ఇంటింటా తిరుగుతూ ప్రజలను కలిశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ పథకాల వివరాలను ప్రజలకు వివరిస్తూ, రానున్న మునిసిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తోందని, ప్రతి వర్గానికి న్యాయం చేసే విధంగా పాలన సాగిస్తున్నదని నాయకులు ఈ సందర్భంగా తెలిపారు. వార్డు అభివృద్ధి, మౌలిక సదుపాయా ల కల్పనలో శ్వేత పాండురంగా రెడ్డి కీలక పాత్ర పోషిస్తారని వారు విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ ప్రచార కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలిచారు. కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి శ్వేత పాండురంగా రెడ్డి గెలుపు ఖాయమని నాయకులు ధీమా వ్యక్తం చేశారు.

Tags:

About The Author

Latest News

మహబూబ్నగర్ కార్పొరేషన్ మేయర్ పీఠంపై వీడని ఉత్కంఠ  - రేపు ఉదయం 11 గంటలకు నేరుగా మున్సిపల్ కార్యాలయానికి చేరుకొనున్న కార్పొరేటర్లు  మహబూబ్నగర్ కార్పొరేషన్ మేయర్ పీఠంపై వీడని ఉత్కంఠ  - రేపు ఉదయం 11 గంటలకు నేరుగా మున్సిపల్ కార్యాలయానికి చేరుకొనున్న కార్పొరేటర్లు 
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదే తుది నిర్ణయం అంటూ ఉన్న స్థానిక నాయకులు
గీత వృత్తి రక్షణకై బడ్జెట్ లో 5 వెల కోట్లు కేటాయించాలని కోరుతూ *ఫిబ్రవరి 17న ఇందిరాపార్క్ వద్ద గీత కార్మికుల నిరాహార దీక్షను జయప్రదం చేయండి.
అభివృద్ధి కోసం అధికార పార్టీతో కలిసి పని చేస్తాను..
తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సంబరాలు
మహాశివరాత్రికి నిరంతర విద్యుత్ సరఫరా : సూపెరింటెండింగ్ ఇంజనీర్ వెల్లడి.
ప్రొఫెసర్ డాక్టర్ రాజు నాయక్ పీహెచ్ డీలో డాక్టరేట్ రావడంఫై పలువురి హర్షం. 
ప్లాస్టిక్ నివారణకు జ్యూట్ బ్యాగుల ప్రోత్సాహం