బలగం మూవీ కోసం పది కేజీల పెరిగాను , నా సిగ్గును చూసే నన్ను సెలెక్ట్ చేశారు - బలగం నటి  సౌదామిని....

బలగం మూవీ కోసం పది కేజీల పెరిగాను , నా సిగ్గును చూసే నన్ను సెలెక్ట్ చేశారు -  బలగం నటి  సౌదామిని....

ఆప్యాయతలు.. పంతాలను వెండితెరపై ఆవిష్కరించింది ఈ . ఈ చిత్రంలో నటించిన వారంతా ఫేమస్ నటీనటులు కాదు. కానీ తమ నటనతో ప్రేక్షకులను కన్నీళ్లు పెట్టించారు. బలగం మూవీలో నటించి ప్రతి ఆర్టిస్ట్ ఒక్కసారిగా క్రేజ్ వచ్చేసింది. ఈ చిత్రం ఓవైపు ఓటీటీలో విడుదలైనప్పటికీ గ్రామాల్లో ఇప్పటికీ ఈ స్క్రీన్స్ వేస్తున్నారు. ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ జంటగా నటించగా.. మిగతా నటీనటులు అడియన్స్ కు అంతగా తెలియనివారే. కానీ ఈ తో ప్రేక్షకుల మనసులలో చెరగని స్థానం సంపాదించుకున్నారు. ఈ మూవీలో కనిపించింది తక్కువ సమయమే అయినా.. తన నటనతో నవ్వించింది. ఎక్కువగా డైలాగ్స్ లేకుండానే జనాలకు గుర్తుండిపోయింది. తనే సౌదామిని.

బలగం లో ప్రియదర్శి పెళ్లి చేసుకోబోయే అమ్మాయిగా కనిపించింది సౌదామిని. కొమురయ్య చనిపోయినప్పుడు కాబోయే భర్త ఇంటికి రావడం.. అక్కడ ప్రియదర్శి.. సౌదామిని మధ్య ఎలాంటి డైలాగ్స్ లేకుండానే.. కేవలం ఎక్స్‏ప్రెషన్స్‏తో సీన్స్ ప్రేక్షకులను నవ్వించాయి. ఇందులో ఒక్క డైలాగ్ లేకపోయినా.. తన ఎక్స్‏ప్రెషన్స్‏తోనే ఫేమస్ అయ్యింది. ఆర్టిస్ట్ కావాలనే కోరికతో టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సౌదామిని.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఈ కోసం తాను ఏకంగా పది కేజీల బరువు పెరిగినట్లు చెప్పుకొచ్చింది.

“ అడిషన్‏కు వెళ్లాక నన్ను సిగ్గు పడమన్నారు. సిగ్గు పడగానే సెలక్ట్ చేశారు. సౌదామిని పేరును వేణు సర్ సౌమ్య పిలిచారు. ఈ లో ప్రియదర్శి చాలా సపోర్టింగ్ గా ఉంటారు. కోసం పది కేజీలు పెరిగాను. కేకులు తినేసి బరువు పెరిగాను. ఫన్ జోనర్ లంటే చాలా ఇష్టం. నా ఫస్ట్ ఇదే. బీఎస్సీ ఫస్ట్ ఇయర్ లోనే చదువు ఆపేశా. చిన్నప్పటి నుంచి ఆర్టిస్ట్ అవ్వాలని కోరిక ఉండేది. ఎక్కడికి వెళ్లినా అన్నయ్యతో వెళ్తాను. చాలా మంది నువ్వు నీ మొహానికి హీరోయిన్ అవుతావా అనేవాల్లు. నేను స్థాయికి రావడం కారణం వేము సర్. బలగం చూసి డైరెక్టర్ అనుదీప్ కాల్ చేశారు. మా లో నీకు మంచి క్యారెక్టర్ ఇస్తామని చెప్పారు” అంటూ చెప్పుకొచ్చింది సౌదామిని.

Tags:

About The Author

Latest News

హైదరాబాద్‌లో వరద ముంపు ప్రాంతాలపై సీఎం రేవంత్ ఆకస్మిక తనిఖీ హైదరాబాద్‌లో వరద ముంపు ప్రాంతాలపై సీఎం రేవంత్ ఆకస్మిక తనిఖీ
హైదరాబాద్‌లో భారీ వర్షాల కారణంగా వరదలతో ముంపు ప్రాంతాలను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆదివారం ఆకస్మికంగా పరిశీలించారు. అమీర్‌పేట్ బుద్ధనగర్, మైత్రివనం, బాల్కంపేట తదితర ప్రభావిత...
వంగవీడులో 630 కోట్ల జవహర్ ఎత్తిపోతల పథక శంకుస్థాపన – మంత్రి కోమటి రెడ్డి
అమెరికాలో ఘనంగా రక్షా బంధన్ వేడుకలు
మార్ష్‌మెల్లో మాస్క్ వెనుక స్ఫూర్తి – ‘అలోన్’ వీడియోలోని అర్ధం
కేటీఆర్ పై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలను ఖండించిన మాజీ మంత్రి
ఎస్‌.ఎస్‌. రాజమౌళి సినిమాల బడ్జెట్‌, కలెక్షన్ల రికార్డులు
జనగామ జిల్లాలో ఘనంగా బోనాల పండుగ