కల్తీకల్లుతో ఐదుగురు మృతితో అప్రమత్తమైన నిజామాబాద్ ఎక్సైజ్ శాఖ అధికారులు...

కల్తీకల్లుతో ఐదుగురు మృతితో అప్రమత్తమైన నిజామాబాద్ ఎక్సైజ్ శాఖ అధికారులు...

మూనాళ్ళ ముచ్చట తనిఖీలా? నిరంతర తనిఖీలా

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి: (లోకల్ గైడ్) హైదరాబాద్ కూకట్ పల్లిలో  కల్తీ కల్లు సేవించి ఐదుగురు మృతి చెందిన విషయం తెలిసిందే..దీంతో ఎక్సైజ్ శాఖ మంత్రి ఆదేశానుసారం అధికారులు అప్రమత్తమయ్యారు.. నిజామాబాద్ నగర పరిధిలోని మూడు కల్లు డిపోలలో లైసెన్స్ అలాగే కల్లు తయారీ,ఈత వనాలను డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి, ఎన్ఫోర్స్మెంట్ సీఐ స్వప్న పరిశీలించారు..ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యం దృష్ట్యా స్వచ్ఛమైన కల్లునే తయారు చేయాలని తయారీదారులకు సూచించారు.
అనంతరం నిజామాబాద్ శివారులోని మల్లారంలో 16 ఎకరాల్లో ఉన్న ఈతవనాన్ని అధికారులు తనిఖీ చేశారు. ఈతవనం నుంచే కల్లును సేకరించాలని ఆ కల్లునే విక్రయించాలని తయారీదారులకు సూచించారు.. ఈ తనిఖీల్లో సుష్మిత, ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
హైదరాబాద్  కూకట్ పల్లిలో కల్తీకల్లు తాగి ఐదుగురు మృతి చెందారని  మూనాళ్ళ ముచ్చటగా మామా అనుకుంటూ తనిఖీ చేసి అధికారులు చేతులు దులుపుకోకుండా నిరంతర తనిఖీలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు..

Tags:

About The Author

Related Posts

Latest News

పోలీస్ స్టేషన్ లో గంజాయితో పట్టుబడ్డ మహ్మద్ జీషాన్ ఆత్మహత్యయత్నం... పోలీస్ స్టేషన్ లో గంజాయితో పట్టుబడ్డ మహ్మద్ జీషాన్ ఆత్మహత్యయత్నం...
  నిజామాబాద్ జిల్లా ప్రతినిధి : (లోకల్ గైడ్) నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆరవ టౌన్ పోలీస్ స్టేషన్ లోయువకుడు ఫినాయిల్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు..నిజామాబాద్ జిల్లా
గంజాయి విక్రయిస్తున్న ఓ మహిళ, ఇద్దరు యువకుల అరెస్ట్...
పింఛన్ డబ్బుల కోసం కన్న తల్లిని హత్య చేసిన కర్కటకుడైన కొడుకు...
మద్యం సేవించి న్యూసెన్స్ చేసిన షేక్ ఫెరోజ్ కు ఏడు రోజుల జైలు శిక్ష...
చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే శిక్షార్హులు..
మృత్యువు కూడా వీడదీయనిది మూడు మూడుముళ్ళ బంధం...
కల్తీకల్లుతో ఐదుగురు మృతితో అప్రమత్తమైన నిజామాబాద్ ఎక్సైజ్ శాఖ అధికారులు...