మృత్యువు కూడా వీడదీయనిది మూడు మూడుముళ్ళ బంధం...
కలిసి ఏడడుగులు వేసి చివరికి కలిసి తిరిగిరాని లోకానికి వెళ్లారు దంపతులు
నిజామాబాద్ జిల్లా ప్రతినిధి: సిరికొండ (లోకల్ గైడ్) భర్త అనారోగ్యంతో మృతి చెందగా అంత్యక్రియలు ముగించుకొని ఇంటికి వచ్చే సరికి భార్య సైతం మృతి చెందింది..దీంతో కుటుంబ సభ్యుల్లో విషాదం గ్రామంలో విషాదం నింపింది.. మృత్యువు కూడా వారి మూడు ముళ్ళ బంధాన్ని విడదీయలేకపోయింది. ఏడడుగుల బంధంతో ఏకమైన దంపతులు ఏడు పదుల వయస్సు వచ్చిన ఒక్కటైన భార్యాభర్తలు చావులోనూ ఒక్కట య్యారు..చివరికి దంపతులు ఇద్దరూ కలికాలం కలిసుంటామని మాటిచ్చుకొని చివరికి కలిసి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.. సిరికొండ మండలం గడ్కోల్ గ్రామానికి చెందిన సిరిపురం నడ్పి నర్సయ్య (76), ఆయన భార్య నర్సవ్వ(68) బుధవారం మృతి చెందారు. అనారోగ్యంతో బాధపడుతున్న నర్సయ్య బుధవారం ఉదయం మృతి చెందారు.
కుటుంబ సభ్యులు అంత్యక్రియలు చేసి ఇంటికి రాగా, భార్య నర్సవ్వ కూడా చనిపోయారు. ఒకేసారి దంపతులు మృతి చెందడంతో కుటుంబం, గ్రామంలో విషాదం నెలకొంది...
About The Author
Related Posts
